ETV Bharat / international

Pig Kidney Transplant In Human : త్వరలో బతికున్న మనిషికి పంది కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్​!.. ఇకపై అవయవాల కొరతకు చెక్!​ - పంది కిడ్నీ మార్పిడి విజయవంతం

Pig Kidney Transplant In Human : బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ప్రయోగం నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. పంది మూత్రపిండం గతంలో కంటే ఎక్కువగా 2నెలలపాటు సాధారణంగా పనిచేసి చరిత్ర సృష్టించింది. మానవులకు అవయవాల కొరతను అధిగమించడానికి చేస్తున్న ప్రయోగాల్లో వైద్యులు పురోగతి సాధించారు.

Pig Kidney Transplant In Human
Pig Kidney Transplant In Human
author img

By PTI

Published : Sep 15, 2023, 8:06 AM IST

Pig Kidney Transplant In Human : అమెరికాలో 2నెలలక్రితం బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పందికిడ్నీని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్‌ చేసిన ప్రయోగాన్ని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం వైద్యులు ముగించారు. పందికిడ్నీని తొలగించి... వైద్య పరిశోధనల కోసం దానం చేసిన శరీరాన్ని అంత్యక్రియల కోసం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. చనిపోయిన వ్యక్తిలో ట్రాన్స్‌ప్లాంట్‌ చేసిన పంది మూత్రపిండం గతంలో కంటే ఎక్కువ రోజులు పనిచేయటం ఇదే మొదటిసారి. చనిపోయిన వ్యక్తిపై జరిపిన ఈ పరిశోధన ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్న వైద్యులు... త్వరలో జీవించి ఉన్నవారిలోను పంది మూత్రపిండాలను ట్రాన్స్‌ప్లాంటు చేయాలనే ఆశతో... ఆ వివరాలు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Pig Kidney Transplant Update 2023 : జినో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అని పిలిచే ఈ ప్రయోగం కొన్ని దశాబ్దాలపాటు విఫలమైంది. మానవ రోగనిరోధక వ్యవస్థ వెంటనే... జంతువుల కణజాలాన్ని నాశనం చేసేది. పందులను జన్యు మార్పిడి చేయటంవల్ల... వాటి అవయవాలు మానవుల మాదిరిగానే ఉంటాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇది సాధ్యమేనని... తాము తెలుసుకున్నట్లు న్యూయార్క్‌ వర్సిటీకి చెందిన వైద్యులు తెలిపారు. కొన్ని స్వల్పకాలిక ప్రయోగాల్లో... చనిపోయిన శరీరాల్లో రోగనిరోధక వ్యవస్థ వెంటనే దాడిచేయకుండా తప్పించగలిగినట్లు చెప్పారు. అయితే తిరస్కరణ సాధారణ రూపంపై స్పష్టత లేనప్పటికీ... అందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

Pig Kidney Transplant Human News : గతేడాది మేరీల్యాండ్‌ యూనివర్సిటీకి చెందిన వైద్యులు... చనిపోతున్న వ్యక్తిని పంది గుండెతో కాపాడే ప్రయత్నం చేశారు. అతను రెండునెలలు మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. పంది గుండె విఫలం కావటానికి గల కారణాలపై స్పష్టతలేదు. మనిషితో పోలిస్తే... పంది అవయవాలు నిజంగా ఎలా పనిచేస్తాయనే విషయమై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ వద్ద పెద్ద ప్రశ్నల జాబితా ఉంది. ఆ ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం లభిస్తుందని... మిల్లర్ మృతదేహాన్ని 2నెలలపాటు వెంటిలేటర్‌పై ఉంచి ప్రయత్నించారు.

మిల్లర్‌ కుప్పకూలిపోవటం వల్ల వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అని ప్రకటించారు. మృతుడు క్యాన్సర్‌ రోగి కావటం వల్ల అవయవాలు దానంచేయలేకపోయారు. పంది అవయవాల ట్సాన్స్‌ ప్లాంటేషన్‌ కోసం మిల్లర్‌ శరీరాన్ని అతని కుటుంబసభ్యులు దానం చేశారు. 58వ జన్మదినం సందర్భంగా... జులై 14న మిల్లర్‌ మూత్రపిండాల స్థానంలో పంది మూత్రపిండాలు, రోగనిరోధక కణాలకు శిక్షణ ఇచ్చే గ్రంధీని ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. మొదటినెల పంది మూత్రపిండం ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసింది. రెండోనెల... మూత్రం తయారీలో కొంత తగ్గుదలను వైద్యులు గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ తిరస్కరణ మొదలైనట్లు బయాప్సీలో వెల్లడైంది. ఇది చికిత్స చేయదగినదో కాదో తేల్చేందుకు వైద్యులకు అవకాశం లభించింది. రోగులు ఉపయోగించే ప్రామాణిక రోగ నిరోధకత- అణచివేసే మందుల మార్పుతో మూత్రపిండాల పనితీరు తిరిగి పుంజుకుంది. న్యూయార్క్‌ వర్సిటీ బృందం, FDA ఇతర ప్రశ్నలను పరిశీలించింది. మానవ హార్మోన్లు, విసర్జించిన యాంటీబయాటిక్స్ లేదా ఔషధ సంబంధిత దుష్ప్రభావాలకు పంది మూత్రపిండం ఎలా స్పందించిందనే విషయంలో తేడాలు లేవని గుర్తించారు.

Pig Kidney Transplant to Human : బ్రెయిన్​డెడ్​ పేషెంట్​కు పంది కిడ్నీ.. మనిషి మూత్రపిండం కంటే మెరుగ్గా పనిచేస్తోందట!

మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు- ఆపరేషన్ సక్సెస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.