Pig Heart Transplant To Human Died : అమెరికాలోని మేరీల్యాండ్‌లో జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అమర్చిన రెండో వ్యక్తి.. శస్త్ర చికిత్స జరిగిన ఆరు వారాల తర్వాత మరణించాడు. ఈ విషయాన్ని మేరీల్యాండ్ వైద్యులు వెల్లడించారు. సోమవారం అతడు మృతి చెందాడని ప్రకటించారు. ఆపరేషన్ జరిగాక ఇన్ని వారాలపాటు బతికి ఉంటాడని తాము అనుకోలేదని అతడి భార్య చెప్పారు.
తొలి నెలరోజుల పాటు బాగానే ఉన్నా..
Pig Heart Transplant To Human Latest News : సెప్టెంబరులో మరణ ముప్పును ఎదుర్కొంటున్న 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్ను కాపాడేందుకు చివరి ప్రయత్నంగా జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అమర్చారు మేరీల్యాండ్ వైద్యులు. అయితే ఆపరేషన్ జరిగాక.. తొలి నెలరోజుల పాటు అతడి శరీరంలోని పంది గుండె ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రతికూల సంకేతాలు వచ్చాయని.. చివరకు సోమవారం మరణించాడని చెప్పారు.
పంది గుండె అమర్చిన తొలి వ్యక్తి కూడా..
Pig Heart Into Human Patient Dead : గతేడాది ఇదే మేరీల్యాండ్ వైద్యుల బృందం ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను మరణ ముప్పు ఎదుర్కొంటున్న డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి మార్పిడి చేసింది. అయితే చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు.
పంది అవయవాలే ఎందుకంటే..
Pig Body Parts Used For Survival : అవయవ మార్పిడి కోసం మొదట్లో వానరాలపై ఆధారపడ్డ శాస్త్రవేత్తలు.. ఆ తర్వాత పందులపై దృష్టి సారించారు. వరాహాల్లోని అవయవాల పరిమాణం చాలా వరకూ మానవుల్లోని అవయవాలకు దగ్గరగా ఉంటాయి. పందుల గుండె కవాటాలనూ దశాబ్దాలుగా మనుషులకు అమరుస్తున్నారు. పందుల గుండెతో పాటు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను మనుషులకు ఉపయోగించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. మానవుల్లో కాలిన గాయాలకు గ్రాఫ్టింగ్ చేయడానికి వరాహాల చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. పందులు చాలా వేగంగా ఎదగడం, అవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనడం వంటివి కూడా వాటివైపు మొగ్గడానికి కారణమవుతున్నాయి.