ETV Bharat / international

'రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. చివరి వరకు పోరాడతా' - పాక్​ పీఎం

అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్నందున రాజీనామా చేయనున్నారన్న వార్తలను కొట్టిపారేశారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజీనామా వార్తల నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Pakistan PM Imran Khan
పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్
author img

By

Published : Mar 31, 2022, 9:43 PM IST

ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాజీనామా చేసే ప్రసక్తే లేదని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. చివరి వరకు పోరాటం చేయనున్నట్లు చెప్పారు. రాజీనామా వార్తల నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇమ్రాన్‌ ఖాన్​. దేవుడు తనకు అన్ని ఇచ్చాడని తనకు దేనిపైనా వ్యామోహం లేదన్నారు. అధికారం నిలబెట్టుకునేందుకు ఎవరి ముందు తలొగ్గే ప్రసక్తే లేదని ఇమ్రాన్‌ఖాన్‌ స్పష్టం చేశారు.

" పాక్‌ స్వాతంత్యం సాధించిన తర్వాత పుట్టిన మొదటి తరానికి నేను ప్రతినిధిని. ఇమ్రాన్​ ఖాన్​ను పదవి నుంచి దింపేయాలని, లేదంటే పాకిస్థాన్​ తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఓ దేశం సందేశం పంపించింది. నేను 20 ఏళ్ల పాటు క్రికెట్​ ఆడాను. చివరి బంతి వరకు ఆడతానని ప్రపంచంతో పాటు నాతో ఆడిన వారంతా చూశారు. ఓటమి ఎప్పటికీ అంగీకరించను. నేను ఇంట్లో కూర్చుంటానని ఎవరూ ఆలోచించొద్దు. ఫలితం ఎలా ఉన్నా.. మరింత బలంగా తిరిగొస్తా. నా చిన్నప్పుడు పాకిస్థాన్​ అగ్రస్థానంలో ఉండేది. దక్షిణ కొరియా ఇక్కడికి వచ్చి అభివృద్ధి గురించి తెలుసుకునేది. విదేశాల నుంచి మన యూనివర్సిటీల్లో చదువుకునేందుకు విద్యార్థులు ఎక్కువగా వచ్చేవారు. మలేసియా యువరాణి నాతో పాటు చదువుకుంది. అవన్ని ఇప్పుడు క్షీణిస్తున్నాయి. నా దేశం అవమానాలకు గురవుతోంది."

- ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధానమంత్రి.

అంతకుముందు ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునేందుకు ఇమ్రాన్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటే పార్లమెంటును రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదననను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి.

ఇదీ చూడండి: ఇమ్రాన్​కు కాస్త ఊరట.. 'అవిశ్వాసం'పై చర్చ మళ్లీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.