ETV Bharat / international

3 వారాలకే విదేశీ మారక నిల్వలు.. దివాలా అంచున పాకిస్థాన్​.. మరో శ్రీలంకగా మారనుందా..? - pakistan crisis latest news

విదేశీ మారకం నిల్వలు పాతాళానికి చేరడం వల్ల పాక్‌ పని అయిపోయినట్లే కనిపిస్తోంది. కేవలం 3 వారాలకు సరిపడా మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్ తాజాగా చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎమ్​ఎఫ్​) 2019 విధించిన షరతులకు ప్రత్యామ్నాయం లేక అంగీకరించాల్సి వచ్చింది. ఎంత కష్టమైనా ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.

Pakistan PM ON IMF
ఐఎమ్​ఎఫ్​పై పాకిస్థాన్​ ప్రధాని షరీఫ్​
author img

By

Published : Feb 3, 2023, 8:25 PM IST

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. పదేళ్ల కనిష్ఠానికి క్షీణించి కేవలం 3 వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు పాక్ సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. బుధవారం నాటికి ఈ నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ తెలిపింది. రుణ చెల్లింపుల వల్ల 592 మిలియన్‌ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు క్షీణించినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుతం ఆ దేశ కమర్షియల్‌ బ్యాంకుల వద్ద ఉన్న 5.65 బిలియన్‌ డాలర్లతో కలుపుకుని మొత్తం విదేశీ మారకపు నిల్వలు 8.74 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుందని పాక్‌ ప్రజలు ఆహారం కొనుగోలు చేసేందుకు కూడా తీవ్రంగా అవస్థలు పడుతున్నట్లు చెప్పింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాక్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎమ్​ఎఫ్​) గతంలోనే రకరకాల షరతులు విధించింది. 2019లో ఐఎమ్​ఎఫ్​తో జరిగిన చర్చల్లో భాగంగా పేర్కొన్న ఆంక్షలకు అప్పటి ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఒప్పుకోకపోవడం వల్ల అర్ధాంతరంగా అవి నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి చేయిదాటి దేశవ్యాప్తంగా ఆకలి కేకలు పెరిగిపోతుండటం చేత పాక్‌కు మరో దారేమి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఐఎమ్​ఎఫ్ విధించిన తీవ్ర ఆంక్షలపై పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ స్పందించారు. సాయం అందించేందుకు ఐఎమ్​ఎఫ్ ఊహకందని షరతులు విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే వాటిని పాటించక తప్పదని పేర్కొన్నారు. 2019లో నిలిచిపోయిన కీలక ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరించేందుకు తుది చర్చల కోసం ఐఎమ్​ఎఫ్ ప్రతినిధి బృందం పాక్‌లో పర్యటిస్తోంది.

ఐఎమ్​ఎఫ్ నుంచి 600 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం తీసుకోవడానికి 2019లోనే అంగీకరించినా కఠిన షరతుల కారణంగా పాక్‌ వెనకడుగు వేసింది. నిధులివ్వాలంటే పాక్‌లో కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలని.. అంతర్జాతీయ విపణి ధరలకు తగ్గట్టు గ్యాస్‌ ఛార్జీలను నిర్ణయించాలని ఐఎమ్ఎఫ్ సూచించింది. పాక్‌ రూపాయి మారక విలువను మార్కెట్‌ ఆధారంగా నిర్ణయించాలని.. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్​(ఎల్​ఓసీ)లపై నిషేధం తొలగించాలని ఐఎమ్ఎఫ్ నిబంధనలు పెట్టింది. ఈ ఆంక్షలు తీవ్రమైనవే అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక గండం నుంచి గట్టెక్కాలంటే వీటిని తప్పకుండా పాటించాల్సిందేనని షెహబాజ్ షరీఫ్ దిగొచ్చారు. అయితే వీటి కారణంగా అక్టోబరులో జరిగే పాక్‌ సాధారణ ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తగులుతుందని షెహబాజ్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.