ETV Bharat / international

న్యూస్​ రీడర్​కు బిగ్​ సర్​ప్రైజ్​.. ఖరీదైన బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన కిమ్ - north korea news today kim jong un

North Korea lady news reader: ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్​ యాంకర్​ రీ చున్​ హీకి ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్​.. అత్యంత విలాసవంతమైన ఇల్లును కానుకగా ఇచ్చారు. 50ఏళ్లకుపైగా దేశం కోసం, అధికారిక పార్టీ కోసం ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ ఇంటిని ఇచ్చినట్లు కిమ్​ స్పష్టం చేశారు.

north korea lady news reader
న్యూస్​ రీడర్​కు బిగ్​ సర్​ప్రైజ్​.. ఖరీదైన బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన కిమ్
author img

By

Published : Apr 14, 2022, 4:00 PM IST

North Korea news reader woman: కొరియా సంప్రదాయ వస్త్రధారణ.. ప్రజల్లో దేశభక్తిని ఉప్పొంగించేలా ఉండే భావోద్వేగభరిత స్వరం.. ఐదు దశాబ్దాలు పైబడిన అనుభవం.. ఇదంతా ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్​ న్యూస్​క్యాస్టర్​ రీ చున్​ హీ(79) గురించే. ఒకప్పటి దేశాధినేత మరణం మొదలు.. ప్రస్తుత నియంత జరిపే అణుపరీక్షలు వరకు.. ఉత్తర కొరియాకు సంబంధించిన కీలక వార్తలన్నింటినీ ప్రజలకు తెలియచేసే రీ చున్ హీ.. విదేశీయులకూ సుపరిచితమే. కేసీఎన్​ఏ టీవీ ఛానల్​లో వార్తలు చదువుతూ 'పింక్ లేడీ'గా పాశ్చాత్య దేశాల్లో పేరొందిన ఆమె.. ఇప్పుడు తనే వార్తగా మారారు.

కిమ్ స్పెషల్ గిఫ్ట్​: రీ చున్​ హీకి బుధవారం అదిరిపోయే కానుక ఇచ్చారు ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్. పాంగ్యాంగ్​లో నిర్మించిన విలాసవంతమైన ఇంటిని ఆమెకు అందజేశారు. స్వయంగా ఆ ఇంటికి వెళ్లి రీ చున్​తో కలియతిరిగిన కిమ్.. ఆమె మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే అవేంటో చెప్పలేదు.

"విప్లవాత్మక అధికార ప్రతినిధిగా బాల్యం నుంచి 50ఏళ్లకుపైగా సేవలు అందించిన రీ చున్​కు పార్టీ రుణపడి ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటూ పార్టీ కోసం ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నా" అని కిమ్​ అన్నట్లు కేసీఎన్​ఏ టీవీ ఛానల్​ గురువారం తెలిపింది. "ఈ ఇల్లు ఓ అద్భుతమైన హోటల్​లా ఉంది. అధికార పార్టీ ధర్మగుణానికి ముగ్ధులై, కృతజ్ఞతగా మా కుటుంబసభ్యులు అందరూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు" అని రీ చున్​ హీ చెప్పారని కేసీఎన్​ఏ వెల్లడించింది.

రీ చున్​తో పాటు పార్టీ కోసం పని చేస్తున్న మరికొందరికి కిమ్ బుధవారం విలాసవంతమైన ఇళ్లను కానుకగా అందజేశారు. 1970లలో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్ నివాసం ఉన్న చోటే ఈ ఇళ్లు నిర్మించారు. శుక్రవారం కిమ్ ఇల్ సంగ్ 110వ జయంతి నేపథ్యంలో రాజభక్తి ప్రదర్శించిన వారందరినీ ఇలా సత్కరించి, ఉత్తర కొరియాలోని ఉన్నత వర్గాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నది కిమ్ ఆలోచనని నిపుణులు అంటున్నారు.

కేబినెట్​ హోదాతో..: రీ చున్​ హీ.. 1970లలో, ఉత్తర కొరియా ఇంకా కిమ్ ఇల్​ సంగ్​ పాలనలో ఉండగానే ఆ దేశ అధికార టీవీ ఛానల్​లో చేరారు. అప్పటి నుంచి దాదాపు ప్రతి ముఖ్యమైన వార్తను ఆమె ద్వారానే ప్రజలకు అందించింది కేసీఎన్​ఏ. ప్రస్తుతం 79ఏళ్ల వయసున్న రీ చున్​కు.. కేబినెట్ సభ్యురాలి స్థాయిలో వసతులు, గౌరవమర్యాదలు ఉంటాయని సమాచారం. గతేడాది మిలిటరీ పరేడ్​లో కిమ్​ జోంగ్ ఉన్​ పక్కనే కూర్చుని, భుజంపై చేయి వేసి, ఆయనతో మాట్లాడిన వీడియో.. రీ చున్​ స్థాయిని తెలియచేస్తుందన్నది విశ్లేషకుల మాట.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.