ETV Bharat / international

ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు.. కఠిన చర్యలకు కిమ్​ ఆదేశం - COVID-19 preventive measures

North Korea First Covid case: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశాధినేత కిమ్​ జోంగ్​.. కట్టడి చర్యలను పెంచాలని అధికారులను ఆదేశించారు​. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​లు విధించాలని స్పష్టం చేశారు.

north korea first covid case
కొరియాలో కరోనా తొలి కేసు
author img

By

Published : May 12, 2022, 8:08 AM IST

Updated : May 12, 2022, 9:05 AM IST

North Korea First Covid case: కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదైంది. చైనాలో వైరస్​ వెలుగు చూసిన వెంటనే సరిహద్దులు మూసివేసి కట్టడి చర్యలు చేపట్టారు ఆ దేశాధినేత కిమ్​ జోంగ్​ ఉన్​. ఇన్నాళ్లు ఒక్క కేసు కూడా రాలేదని గర్వంగా చెప్పుకున్నారు. తాజాగా తొలి కేసు నమోదైన నేపథ్యంలో కొవిడ్​-19 కట్టడి చర్యలను పెంచాలని ఆదేశించారు కిమ్​​. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​లు విధించాలని స్పష్టం చేశారు.

ప్యాంగ్యాంగ్​​లో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒమిక్రాన్​ వేరియంట్​ నిర్ధరణ అయినట్లు కొరియన్​ సెంట్రల్​ న్యూస్​ ఏజెన్సీ గురువారం తెలిపింది. కరోనా కేసులు వెలుగుచూసిన క్రమంలో కిమ్.. అధికార కొరియన్​ వర్కర్స్​ పార్టీ పొలిట్​బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొంది. వైరస్​ కట్టడి చర్యలను పెంచాలని సభ్యులు నిర్ణయించారని తెలిపింది. వైరస్​ వ్యాప్తిని అదుపు చేయటం, సంక్రమణ మూలాల్ని వీలైనంత త్వరగా రూపుమాపాలని అధికారులను కిమ్​ ఆదేశించారని తెలిపింది.

తమ భూభాగంలోకి కొవిడ్​-19 ప్రవేశించకుండా అడ్డుకోగలిగామని ఉత్తర కొరియా ఇన్నాళ్లు గర్వంగా చెప్పుకుంది. చైనాలో వైరస్​ కేసులు వెలుగు చూసిన వెంటనే అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసి.. వాణిజ్య, పర్యటకులను సైతం దేశంలోకి రాకుండా చేసింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోయింది. దానికి తోడు దశాబ్దాల అసంబద్ధ పాలన, అమెరికా ఆంక్షలు సంక్షోభాన్ని మరింత పెంచాయి.

ఇదీ చూడండి: టైట్​ జీన్స్​, జుట్టుకు రంగులు వేస్తే అంతే! చుక్కలు చూపిస్తున్న కిమ్!!

Last Updated : May 12, 2022, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.