ETV Bharat / international

Nobel Prize In Literature 2023 : నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం - nobel prize in chemistry

Nobel Prize In Literature 2023 : 2023 ఏడాదిగానూ నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసేకు సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి దక్కింది.

Nobel Prize In Literature 2023
Nobel Prize In Literature 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 4:44 PM IST

Updated : Oct 5, 2023, 5:21 PM IST

Nobel Prize In Literature 2023 : 2023 ఏడాదిగానూ నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసేను సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి వరించింది. ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు.. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని అవార్డు ప్రకటన సందర్భంగా స్వీడిష్‌ అకాడమీ కొనియాడింది. సాహిత్యంలో నోబెల్​ బహుమతిని స్టాక్​హోంలో వేదికగా ప్రకటించింది స్వీడిష్ అకాడమీ. తనకు సాహిత్య విభాగంలో నోబెల్ ప్రైజ్ రావడం ఆనందంగా ఉందన్నారు రచయిత జాన్ ఫోసే.

  • BREAKING NEWS
    The 2023 #NobelPrize in Literature is awarded to the Norwegian author Jon Fosse “for his innovative plays and prose which give voice to the unsayable.” pic.twitter.com/dhJgGUawMl

    — The Nobel Prize (@NobelPrize) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జాన్‌ ఫోసె 1959లో నార్వేలోని హేగ్‌సండ్‌ ప్రాంతంలో జన్మించారు. ఏడేళ్ల వయసులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. రచయిత మారేందుకు ఆ ఘటనే జాన్‌ ఫోసెకు స్ఫూర్తిగా నిలిచిందని చెబుతారు. సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన లిటరేచర్‌లో పట్టా పొందారు. 1983లో ఆయన రెడ్‌, బ్లాక్‌ అనే తొలి నవల రాశారు. తన గద్యాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోసె.. రచనల్లో మానవ జీవన స్థితిగతులను ప్రస్తావిస్తారు. మన వ్యక్తిగత జీవితాల్లో జరిగే రోజువారీ సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని గద్యాలు, నాటకాలు రాస్తుంటారు.

Nobel Prize 2023 In Medicine : వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ వీరికి ఈ అవార్డును సోమవారం ప్రకటించారు. అలాగే.. అతి చిన్న స్ప్లిట్​ సెకన్లలో పరమాణువుల్లోని ఎలక్ట్రాన్‌లను పరిశీలించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకుగాను అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్‌ క్రౌజ్‌, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌ హ్యులియర్‌కు ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్‌ బహుమతి దక్కింది.

Nobel Prize 2023 Chemistry : నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణ, అభివృద్ధికిగాను ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి(62), లూయిస్‌ బ్రూస్‌(80), అలెక్సీ ఎకిమోవ్‌(78)కు.. 2023కి నోబెల్‌ బహుమతిని స్వీడెన్​లోని స్టాక్​హోమ్​లో జరిగిన కార్యక్రమంలో రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెన్స్‌ బుధవారం ప్రకటించింది.

వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన వారంపాటు కొనసాగనుంది. శుక్రవారం నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 9న అర్ధశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. నోబెల్‌ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల నగదు అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్లకు పెంచారు. స్వీడిష్‌ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.

నోబెల్ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.

Nobel Prize 2023 Chemistry : కెమిస్ట్రీలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్​ పురస్కారం

Nobel Prize In Physics 2023 : భౌతిక శాస్త్రంలో ఆ ముగ్గురికి నోబెల్​.. ఎల‌క్ట్రాన్ డైన‌మిక్స్​లోని ఆటోసెకండ్ పల్స్‌ అధ్యయనానికి..

Nobel Prize 2023 In Medicine : కొవిడ్ టీకాల అభివృద్ధికి కృషి చేసిన వారికి నోబెల్

Last Updated : Oct 5, 2023, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.