ETV Bharat / international

16 ఏళ్ల లోపు పిల్లల్లో అంతుచిక్కని కాలేయ వ్యాధి.. ఓ చిన్నారి మృతి

author img

By

Published : Apr 25, 2022, 7:24 AM IST

Mystery Liver Disease: ఓ అంతుచిక్కని కాలేయ వ్యాధి అమెరికా సహా పలు ఐరోపా దేశాల్లో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 12దేశాల్లో 169 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఇప్పటికే ఒక చిన్నారి కూడా మృతి చెందినట్లు పేర్కొంది.

Mystery Liver Disease
liver disease who

Mystery Liver Disease: అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాల్లో పిల్లలకు అంతుచిక్కని కాలేయ వ్యాధి సోకుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వ్యాధితో ఓ చిన్నారి కూడా మృతి చెందినట్లు వెల్లడించింది. 12 దేశాల్లో ఇంతవరకు ఇలాంటి 169 కేసులు బయటపడినట్లు పేర్కొంది. ప్రధానంగా బ్రిటన్‌లో ఎక్కువ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని 'అంతుచిక్కని మూలాలతో వచ్చే అతి తీవ్ర హెపటైటిస్‌'గా పేర్కొంది. వ్యాధి బారిన పడినవారంతా ఒక నెల నుంచి 16 ఏళ్ల వయసువారేనని తెలిపింది. వీరిలో 17 మందికి కాలేయ మార్పిడి అవసరమైనట్లు పేర్కొంది. అయితే ఈ వ్యాధితో ఏ దేశంలో మరణం సంభవించిందీ డబ్ల్యూహెచ్‌వో వెల్లడించలేదు.

74 కేసుల్లో అడినోవైరస్‌ను గుర్తించగా.. మరో 20 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బ్రిటన్‌లో తొలిసారి ఇలాంటి కేసులు నమోదు కాగా.. అక్కడ 114 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. "హెపటైటిస్‌ కేసులు పెరుగుతున్నాయా? లేదా సాధారణంగానే ఈ స్థాయిలో కేసులున్నప్పటికీ వాటిపట్ల అవగాహన పెరగడం వల్ల ఇప్పుడే వీటిని గుర్తిస్తున్నారా? అన్నది తెలియరాకుండా ఉంది" అని డబ్ల్యూహెచ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది.

సాధారణంగా జలుబుకు కారణమయ్యే వైరస్‌తో ఈ కేసులకు సంబంధం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. "అడినోవైరస్‌ కూడా ఈ వ్యాధికి కారణం కావచ్చన్న అంచనాలున్నాయి. వ్యాధి కారకాలను కనుగొనేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి" అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. పిల్లల్లో హెపటైటిస్‌ కేసులను గుర్తించే చర్యలను ఆయా దేశాలు ముమ్మరం చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇదీ చూడండి: 'ఉక్రెయిన్​నే కాదు నల్ల జాతీయుల దేశాలనూ పట్టించుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.