ETV Bharat / international

మయన్మార్​లో నలుగురు రాజకీయ నేతలకు ఉరి.. 50 ఏళ్ల తర్వాత..! - ఆంగ్​ సాన్​ సూకీ మయన్మార్

Myanmar news: మయన్మార్ సైన్యం నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష వేసింది. అందులో ఒక మాజీ చట్టసభ సభ్యుడు, మరొక ముగ్గురు ప్రజాస్వామ్య కార్యకర్తలు ఉన్నారు.

myanmar news
మయన్మార్
author img

By

Published : Jul 25, 2022, 12:15 PM IST

Updated : Jul 25, 2022, 12:56 PM IST

Myanmar news: మ‌య‌న్మార్​లోని సైనిక ప్రభుత్వం నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష వేసింది. సైనిక పాలనలో వీరందరూ హింస, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ శిక్ష విధించామని పేర్కొంది. అందులో నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ మాజీ చట్టసభ సభ్యుడు, ప్రజాస్వామ్య కార్తకర్తలు ఉన్నారు. గత 50 ఏళ్లలో మయన్మార్​లో ఇదే మొదటి ఉరిశిక్ష. గతేడాది ఆంగ్​సాన్​ సూకీ నుంచి అధికారాన్ని సైన్యం బలవంతంగా స్వాధీనం చేసుకుంది.

ఉరి తీసిన వారిలో మాజీ చట్టసభ సభ్యుడు పోయో జియా థావ్​, ప్రజాస్వామ్య ఉద్యమకారులు కో జిమ్మి, హ‌లా మియా ఆంగ్‌, ఆంగ్ తురా జా ఉన్నారు. పోయో జియో థావ్ భార్య తన భర్తను ఉరితీసినట్లు తెలియలేదని ప్రముఖ వార్తా పత్రికకు తెలిపింది. ఆంగ్​ సాన్ సూకీ పార్టీలో పోయో థావ్ కీలక నేతగా ఉండేవారు. ఈ నలుగురికి జూన్‌లోనే మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ మ‌య‌న్మార్ ఆర్మీ ప్ర‌క‌ట‌న చేసింది. దానిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా అప్పట్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

ఇవీ చదవండి: వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా.. 17 మంది మృతి

అమెరికాలో అరుదైన కేసు.. ఒకే వ్యక్తికి కరోనా, మంకీపాక్స్!

Last Updated : Jul 25, 2022, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.