ETV Bharat / international

భారత్ దెబ్బ- మాల్దీవులు అధ్యక్షుడి పీఠానికి ఎసరు- ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం! - మాల్దీవులు ఇండియా వివాదం

Muizzu No Confidence Motion : భారత్‌కు వ్యతిరేకంగా ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో మాల్దీవులు పర్యాటకంగా, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముగ్గురు మంత్రులపై వేటు పడినా నిరసనల జ్వాల కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ పీఠాలు కదులుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు మోదీపై వ్యాఖ్యలతో భారీ నష్టం తప్పదని భయాందోళనలకు గురవుతున్నారు. అందుకే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

muizzu-no-confidence-motion
muizzu-no-confidence-motion
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 10:35 AM IST

Muizzu No Confidence Motion : భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులుకు తెలిసివస్తోంది. ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటీ దురుసుతో ఇప్పుడు ఆ దేశ అధ్యక్ష పీఠమే కదులుతోంది. ఇప్పటికే మాల్దీవులుకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోగా, పర్యాటక ఆదాయం తగ్గుతోందని ఆ దేశం గగ్గోలు పెడుతోంది. బాయ్‌కాట్‌ మాల్దీవుల నినాదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న వేళ- ఆ దేశం చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితులపై మాల్దీవుల్లోని అధికార, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ కోరారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు. స్థిరమైన విదేశాంగ విధానాన్ని పెంపొందిచడానికి డెమొక్రాట్లమైన తాము ప్రయత్నించామని, పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పామని, కానీ ఇప్పుడు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని అలీ అజీమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జును అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.

'మన ఎమర్జెన్సీ కాల్ భారత్'
ప్రధానమంత్రి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలపై మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ మండిపడ్డారు. భారతదేశం మాల్దీవులకు విశ్వాసపాత్రమైన మిత్ర దేశమని దీదీ గుర్తు చేశారు. మాల్దీవులకు భారత్‌ క్లిష్ట సమయంలో అండగా నిలిచే స్నేహ దేశమని అన్నారు. మాల్దీవులకు ఆపద వస్తే వెంటనే స్పందించే ఎమర్జెన్సీ కాల్‌ లాంటి దేశంగా భారత్‌ను మరియా అహ్మద్‌ దీదీ అభివర్ణించారు. భారత్‌ తమకు ఎప్పుడూ సాయం చేస్తుందని, రక్షణ రంగ సామర్థ్యం పెంపొందించడానికి తమకు సహకరించిందని గుర్తు చేశారు.

విదేశాంగ మంత్రిపై పార్లమెంట్ విచారణ!
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై త్వరితగతిన మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్దీవుల పార్లమెంటు సభ్యుడు మికెల్ నసీమ్ డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితులకు దారితీసిన పరిణామాలను వివరించేందుకు విదేశాంగ మంత్రిని పార్లమెంటుకు పిలిచి ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై పార్లమెంట్‌ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని అధికారికంగా అభ్యర్థించారు. ప్రస్తుతం భారత్‌తో ద్వై పాక్షిక సంబంధాలు పడిపోతున్నాయని, దీనిపై విదేశాంగ మంత్రిని ప్రశ్నించాలని పార్లమెంటును అభ్యర్థించారు.

మాల్దీవులు మంత్రులపై టూరిజం ఇండస్ట్రీ ఫైర్​- ఆయనపై పార్లమెంట్ విచారణ!

మోదీపై వ్యాఖ్యలు- ముగ్గురు మాల్దీవుల మంత్రులు సస్పెండ్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.