Mexico Gun Firing : సెంట్రల్ మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. ప్యూబ్లా నగర శివార్లలో ఆయిల్ ట్యాంకర్లకు భద్రతగా ఉన్న ఐదుగురు వ్యక్తులను.. బైక్‌పై వచ్చిన ముష్కరులు తుపాకీతో కాల్చి చంపారు. ఇంధనాన్ని దొంగలించడానికే ఈ కాల్పులు జరిపి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
18 మందిని చంపిన 'నరహంతకుడు'
కొన్నిరోజుల క్రితం అమెరికాలోని మైనే రాష్ట్రం లెవిస్టన్ నగరంలోని బార్, బౌలింగ్ అలేలో జరిగిన కాల్పుల్లో 18 మంది మృతి చెందగా.. మరో 13 మంది వరకు గాయపడ్డారు. రద్దీగా ఉన్న ఈ ప్రాంతాల్లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్ల భయభ్రాంతులకు గురైన స్థానికులు.. ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగులు తీశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
కాల్పులు జరిపినట్లు భావిస్తున్న అనుమానితుడి ఫొటోను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అందులో అతడు సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కన్పించాడు. గతంలో అతడు అమెరికా మిలిటరీలో పనిచేసిన ఆయుధాల శిక్షకుడని అనుమానించారు. నిందితుడిని రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. గతంలో గృహహింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే లెవిస్టన్ నగరంలోని ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అతడిని విగతజీవిగా పోలీసులు గుర్తించారు.
టీనేజర్ బర్త్‌డే పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు
అంతకుముందు.. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ టీనేజర్ బర్త్‌డే వేడుకల్లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. సుమారు రాత్రి 10:30 గంటల సమయంలో అలబామాలోని డాడెవిల్లేలో ఈ కాల్పులు జరిగాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి స్టేషన్ మహోగని మాస్టర్ పీస్ డ్యాన్స్ స్టూడియోలో జరుగుతున్న పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న గన్‌తో షూట్ చేశాడు. కాల్పులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతం అలబామాలోని మోంట్‌గోమెరీకి ఈశాన్య దిశలో 92 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చర్చిలో కాల్పులు.. ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు..
తండ్రి లేకుండా కొడుకు అంత్యక్రియలు.. కోపంతో సైనికుడు కాల్పులు.. 13మంది మృతి