Kim Jong Un Cries During Speech : కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏడ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూనే దేశ ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ విలపించారు. ఉత్తరకొరియాలో గత కొంతకాలంగా జననాల రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇటీవల దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న అధ్యక్షుడు కిమ్, ఆ తల్లులను ఉద్దేశించి మాట్లాడారు.
"జననాల రేటు క్షీణతను నిరోధించడం, పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన కర్తవ్యం. ఇందుకోసం మా ప్రభుత్వం తల్లులతో కలిసి పనిచేయాలని అనుకుంటోంది" అని చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలోని తల్లులంతా మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెబుతూ కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ప్రసంగం వినగానే కార్యక్రమానికి హాజరైన మహిళలు కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రసంగం మధ్యలో కిమ్ కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి.
-
NEW: North Korean dictator Kim Jong Un starts crying as he begs North Koreans to have more babies.
— Collin Rugg (@CollinRugg) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
North Korean birth rates are about to skyrocket 📈
The incident happened at the National Mothers Meeting hosted by the dictator who started dabbing his eyes in an effort to get… pic.twitter.com/F8xg0dZ05J
">NEW: North Korean dictator Kim Jong Un starts crying as he begs North Koreans to have more babies.
— Collin Rugg (@CollinRugg) December 5, 2023
North Korean birth rates are about to skyrocket 📈
The incident happened at the National Mothers Meeting hosted by the dictator who started dabbing his eyes in an effort to get… pic.twitter.com/F8xg0dZ05JNEW: North Korean dictator Kim Jong Un starts crying as he begs North Koreans to have more babies.
— Collin Rugg (@CollinRugg) December 5, 2023
North Korean birth rates are about to skyrocket 📈
The incident happened at the National Mothers Meeting hosted by the dictator who started dabbing his eyes in an effort to get… pic.twitter.com/F8xg0dZ05J
అయితే, గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా మహమ్మారి విజృంభించిన నాటి నుంచి కిమ్ తమ దేశ సరిహద్దులను మూసివేశారు. ప్రపంచంతో చాలా వరకు ఎలాంటి సంబంధాలను కొనసాగించడం లేదు. ఫలితంగా వ్యాపార, వాణిజ్యాలు సాగక ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దీంతో దేశంలో చాలా మంది తిండి, కనీస అవసరాలు తీరక పేదరికంలో మగ్గుతున్నట్లు గతంలో పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇలాంటి సమయంలో మరింత ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ తల్లులకు కిమ్ సూచించారు.
కిమ్ పాలనలో కఠిన శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కారణాలకే అక్కడ మరణశిక్షలు విధిస్తుంటారు కిమ్. గతంలో దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోలు చూశాడని ఓ వ్యక్తిని బహిరంగంగా చంపేశారు. ఇలాంటి ఘటలెన్నో అక్కడ జరిగాయి. ఇలాంటి కఠిన ఆంక్షలతో ఉత్తరకొరియా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వీటిని భరించలేక ఇటీవలె ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి రహస్యంగా ఉత్తరకొరియా నుంచి పారిపోయినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఇప్పుడా కుటుంబం కోసం కిమ్ యంత్రాంగం తీవ్రంగా గాలిస్తోందట!
Kim Jong Un Train : లగ్జరీ రైల్లో రష్యాకు కిమ్.. పుతిన్‌తో భేటీ!.. ఆ అంశంపైనే కీలక చర్చలు