Japanese man turns into dog: పూర్తిగా జంతువులా కనిపించాలనుకున్న తన జీవిత కలను సాకారం చేసుకున్నాడు ఓ జపాన్ వాసి. అచ్చూ 'కోలీ' జాతి శునకంలా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకోగా.. వాటిని చూసిన నెటిజన్లు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. పూర్తి శునకంలా కనిపించేందుకు ఓ వ్యక్తి భారీగా ఖర్చు చేయగా, నిపుణులు 40 రోజులపాటు కష్టపడ్డారు. జపాన్‌కు చెందిన న్యూస్.మైనవి (news.mynavi) అనే వార్తా ఏజెన్సీ ఈ విషయాలను వెల్లడించింది.
రూ.12 లక్షలు ఖర్చు చేసి..: జెప్పెట్ అనే ఓ సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం పెద్ద ఎత్తును శిల్పాలను తయారు చేస్తుంది. అద్భుత కళాఖండాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా రూపొందిస్తోంది. కాగా టోకో ఇవీ అనే వ్యక్తి.. తాను పూర్తిగా శునకంలా కనిపించాలనే కోరికను జెప్పెట్ ముందుంచాడు. ఎంత ఖర్చునైనా భరిస్తానని చెప్పడంతో ఇందుకు ఆ సంస్థ అంగీకరించింది. సంస్థ కళాకారులు 40 రోజులపాట కష్టపడి టోకో ఇవీని కోలీ జాతి శునకంలా మార్చారు. మేకప్, ఇతరత్రా ఖర్చుల కోసం ఇవీకి 2 మిలియన్ యెన్‌లు (దాదాపు రూ.12 లక్షలు) ఖర్చయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో, ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్నాడు టోకో ఇవీ. అయితే ఎన్నిరోజులపాటు ఇలా ఉంటాననే విషయం మాత్రం అతడు చెప్పలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : 18వ పుట్టినరోజున గన్ కొని.. నానమ్మపై ట్రయల్ వేసి.. మరో 21 మందిని దారుణంగా..