ETV Bharat / international

ప్రతి మూడేళ్లకు విడాకులు, మళ్లీ పెళ్లి.. ఆ జంట వెరైటీ 'రాజీ' ఫార్ములా! - జపాన్ వింత పెళ్లి

ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2016లో పెళ్లి చేసుకున్నారు. 2019లో విడాకులు తీసుకున్నారు. మళ్లీ వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 2022లో అదే సీన్ రిపీట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరు వారు? ఎందుకు ఇదంతా?

Japanese Couple Divorce and Remarry Every 3 Years
ప్రతి మూడేళ్లకు విడాకులు, మళ్లీ పెళ్లి.. ఆ జంట వెరైటీ 'రాజీ' ఫార్ములా!
author img

By

Published : Apr 2, 2022, 11:53 AM IST

పెళ్లి.. విడాకులు.. పెళ్లి.. విడాకులు.. రిపీట్​! జపాన్​కు చెందిన ఓ యువ జంట లైఫ్​స్టోరీకి సంక్షిప్త రూపమిది. ఓ విషయంలో గొడవ పడ్డ వారిద్దరూ.. రాజీ మార్గంగా ఇలా చేస్తున్నారు. ప్రతి మూడేళ్లకు విడాకులు తీసుకుంటున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే సీన్ రిపీట్ చేస్తున్నారు. ఇలా చేయడం వెనుక ఓ వెరైటీ కారణం ఉంది. అదేంటంటారా?

ఇంటి పేరు కోసం..: పెళ్లి అయితే వధువు ఇంటి పేరు మారడం సంప్రదాయం. అయితే ఇటీవల ఆ ట్రెండ్ మారుతోంది. కొందరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా తండ్రి ఇంటి పేరునే అలా కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఇందుకు ఉదాహరణ. జపాన్​కు చెందిన ఆ అమ్మాయి కూడా అలానే చేయాలనుకుంది. ఇదే ప్రేమికుల మధ్య గొడవకు దారితీసింది. 'మళ్లీ మళ్లీ పెళ్లి' ఒప్పందానికి కారణమైంది.

ఇంటి పేర్లకు సంబంధించి జపాన్​లో ఓ చట్టం అమల్లో ఉంది. పెళ్లి అయితే.. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే ఇంటి పేరు ఉండాలన్నది ఆ చట్టం సారాంశం. అంటే.. అమ్మాయి తన పేరులో.. అబ్బాయి ఇంటి పేరును చేర్చుకోవాలి. లేదా.. భర్త భార్య ఇంటి పేరు పెట్టుకోవాలి. ఆ యువ జంటకు మాత్రం ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. 'నీ ఇంటి పేరు నేనెందుకు పెట్టుకోవాలి' అన్నదే ఇద్దరి వాదన.

2016లో పెళ్లికి కొద్దిరోజుల ముందు, ప్రేమలో మునిగితేలుతున్న సమయంలోనే ఇద్దరి మధ్య ఈ గొడవ జరిగింది. ఇంటి పేరు కోసం విడిపోవడం ఎందుకని అనుకున్న వారు.. కాస్త ప్రశాంతంగా కూర్చుని ఆలోచించారు. జపాన్​లోని ఆ చట్టం వల్ల గతంలో ఎవరైనా ఇలాంటి ఇబ్బంది పడ్డారా అని ఆరా తీశారు. చివరకు ఓ ఒప్పందానికి వచ్చారు.

మూడేళ్లు నీది.. మూడేళ్లు నాది: 2016లో ఈ జంట పెళ్లి చేసుకుంది. ఒప్పందం ప్రకారం తన ఇంటి పేరు మార్చుకుంది వధువు. వరుడి ఇంటి పేరుతో చలామణీ అయింది. 2019లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈసారి భార్య ఇంటి పేరును తన పేరులో చేర్చుకున్నాడు భర్త. 2022 జులైకి మూడేళ్లు పూర్తవుతాయి. అప్పుడు మళ్లీ విడాకులు తీసుకుని, పెళ్లి చేసుకునేందుకు వారు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈసారి మళ్లీ భర్త ఇంటి పేరును పెట్టుకోనుంది భార్య.

వీరిద్దరూ తమ పేర్లు వెల్లడించేందుకు నిరాకరించారు. అయితే.. తరచూ ఇలా ఇంటి పేర్లు మార్చుకోవడం కాస్త ఇబ్బందికరంగానే ఉందని చెబుతున్నారు. ఉద్యోగ సంబంధిత రికార్డులు అన్నింటిలో తన సొంత ఇంటి పేరే ఉంటుందని, ఇతర ప్రభుత్వ దస్త్రాల్లో మాత్రం తన భార్య ఇంటి పేరు ఉంటుందని చెప్పాడు ఆ యువకుడు. ఈ తతంగం అంతా ఎంతో సంక్లిష్టంగా ఉన్నా.. కలిసి ఉండేందుకు ప్రస్తుతం తమకు ఉన్న మార్గం ఇదేనన్నది ఆ జంట మాట.

నిజానికి ఈ సమస్యకు మరో పరిష్కారం కూడా ఉంది. ఇద్దరూ విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుని, ఎవరి ఇంటి పేర్లతో వాళ్లు రికార్డుల్లో నమోదు చేయించుకోవచ్చు. అదే విషయాన్ని జపాన్​ కోర్టుకు తెలియజేసి.. 'ఒకే ఇంటి పేరు' నిబంధన నుంచి మినహాయింపు పొందవచ్చు. అయితే.. విదేశాలకు వెళ్లడం కన్నా మూడేళ్లకోసారి విడాకులు తీసుకుని, పెళ్లి చేసుకునే విధానమే మేలని అంటోంది ఆ జంట.

ఇవీ చూడండి: భారత్​లోని భార్య కోసం పడవపై 2వేల కి.మీ.. నీది సముద్రమంత ప్రేమ గురూ!

14ఏళ్లుగా ఎయిర్​పోర్టే అతడి నివాసం.. ఇంట్లో భార్య ఆ పని చేయనివ్వడం లేదని...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.