Jai Shankar Meets Rishi Sunak : బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. అధికారిక పర్యటన కోసం యూకేకు వెళ్లిన ఆయన.. కుటుంబ సమేతంగా సునాక్‌ను కలిశారు. తన భార్య క్యోకోతో కలిసి ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌కు చేరుకున్న ఆయన.. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహంతో పాటు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను రిషి సునాక్‌కు జైశంకర్ అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను యూకే ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పినట్లు పేర్కొంది.
-
The Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening.
— UK Prime Minister (@10DowningStreet) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations.
🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8d
">The Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening.
— UK Prime Minister (@10DowningStreet) November 12, 2023
Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations.
🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8dThe Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening.
— UK Prime Minister (@10DowningStreet) November 12, 2023
Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations.
🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8d
మరోవైపు, తనకు ఆతిథ్యం ఇచ్చిన రిషి సునాక్ దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ జైశంకర్ కూడా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. భారత్‌లో ఇప్పుడు సమర్థ నాయకత్వం ఉందని అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్‌లో ఉన్న జైశంకర్... లండన్‌లోని శ్రీ స్వామినారాయణ మందిర్‌లో ప్రార్థనలు చేసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సతీ సమేతంగా జైశంకర్ అభిషేక పూజలో పాల్గొన్నారు. సోమవారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత హైకమిషనర్ నిర్వహించే దీపావళి వేడుకలకు హాజరుకానున్నారు.
-
EAM Dr S Jaishankar and his wife Kyoko Jaishankar called on UK Prime Minister Rishi Sunak and his wife Akshata Murty at 10 Downing Street, on #Diwali. Dr. Jaishankar reportedly presented Rishi Sunak with a Lord Ganesha statue and a cricket bat signed by Virat Kohli.
— ANI (@ANI) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
EAM tweets,… pic.twitter.com/93VyXa5cnK
">EAM Dr S Jaishankar and his wife Kyoko Jaishankar called on UK Prime Minister Rishi Sunak and his wife Akshata Murty at 10 Downing Street, on #Diwali. Dr. Jaishankar reportedly presented Rishi Sunak with a Lord Ganesha statue and a cricket bat signed by Virat Kohli.
— ANI (@ANI) November 12, 2023
EAM tweets,… pic.twitter.com/93VyXa5cnKEAM Dr S Jaishankar and his wife Kyoko Jaishankar called on UK Prime Minister Rishi Sunak and his wife Akshata Murty at 10 Downing Street, on #Diwali. Dr. Jaishankar reportedly presented Rishi Sunak with a Lord Ganesha statue and a cricket bat signed by Virat Kohli.
— ANI (@ANI) November 12, 2023
EAM tweets,… pic.twitter.com/93VyXa5cnK
15 వరకు యూకేలో పర్యటన
యూకేలో జైశంకర్ పర్యటన నవంబర్ 15 వరకు కొనసాగనుంది. ఆ దేశ విదేశాంగ శాఖ సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీతోపాటు పలువురు అధికారులతో ఆయన సమావేశమై భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇప్పటికే, భారత్, బ్రిటన్ మధ్య సులభతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టు 8-31 మధ్య 12వ విడత చర్చలు జరిగాయి. ఇదే అంశంపై నవంబర్ 3న భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రదర్శనపై శుభాకాంక్షలు తెలిపారు.
'ప్రధాని అత్తగారినంటే.. ఎవరూ నమ్మలేదు'.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సుధామూర్తి