ETV Bharat / international

Israel Vs Hamas War 2023 : ముష్కరులు నక్కిన మసీదుపై ఇజ్రాయెల్​ దాడులు.. యుద్ధంలోకి హెజ్​బొల్లా.. IDFకు గట్టి వార్నింగ్! - ఇజ్రాయెల్ యుద్ధం

Israel Vs Hamas War 2023 : గాజా జెనిన్​లోని అల్-అన్సార్ మసీదుపై వైమానికి దాడులు జరిపింది ఇజ్రాయెల్​ డిఫెన్స్​ ఫోర్స్. అందులో ఉన్న ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించింది. మరోవైపు, అమెరికాలో ఓ యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు దారుణ హత్య గురైంది.

Israel Vs Hamas War 2023 israel and hezbollah conflict and Synagogue President Murder In Us
మసీదుపై ఇజ్రాయెల్​ వైమానికి దాడులు
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 10:42 AM IST

Israel Vs Hamas War 2023 : ఇజ్రాయెల్​, హమాస్​ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాద స్థావరమైన జెనిన్​లోని అల్-అన్సార్ మసీదుపై వైమానిక దాడులు జరిపింది ఇజ్రాయెల్​ డిఫెన్స్​ ఫోర్స్​. పౌరులపై దాడులు జరిపేందుకు ఈ మసీదు నుంచే ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులకు పాల్పడింది. దీనిపై తమ ఇంటెలిజెన్స్​ నుంచి సమాచారం అందిందని ఇజ్రాయెల్​ డిఫెన్స్​ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉత్తర ఇజ్రాయెల్​పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకలపై ఈ దాడి జరిపినట్లు వారు పేర్కొన్నారు.

ఇద్దరు బందీలను విడిచిపెట్టిన తరువాత తామొక మానవతా సంస్థగా చెప్పుకునేందుకు హమాస్​ ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్​ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. హామాస్​.. ఐసిస్​ కంటే దారణమైన సంస్థ అనే విషయాన్ని ప్రపంచం మరిచిపొదన్నారు. గాజా స్ట్రిప్ ప్రజలను​ హమాస్ రక్షణ కవచంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. పౌరుల మౌలిక సదుపాయాలపై రాకెట్లతో దాడి చేస్తోందని దుయ్యబట్టారు.

గాజాపై దాడులు పెంచేందుకు ప్రణాళికలు..
Israel Strikes Gaza : గాజాపై దాడులను మరింత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇజ్రాయెల్​ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. హమాస్​పై యుద్ధాన్ని తరువాతి దశకు తీసుకువెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకుంటుది: హెజ్​బొల్లా
Israel And Hezbollah Conflict : గాజా స్ట్రిప్​ దాడి చేసినప్పుడుల్లా ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకుంటుదని హెచ్చరించింది హెజ్​బొల్లా. ప్రస్తుతం తాము ఈ పోరాటంలోనే ఉన్నామని హెజ్​బొల్లా డిప్యూటీ లీడర్ షేక్ నయీమ్ కస్సెమ్ తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్​ డ్రోన్​ దాడులు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెజ్​బొల్లా కూడా ఇజ్రాయెల్​పై దాడులకు దిగుతోంది.

అమెరికాలో యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు దారుణ హత్య..
Synagogue President Murder In US : అమెరికాలోని ఓ యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు.. హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఇంటి బయట పొడిచి చంపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలిని సమంత వోల్(40)గా అధికారులు గుర్తించారు. మిషిగన్​లోని డెట్రాయిట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Israel Vs Hamas War 2023 israel and hezbollah conflict and Synagogue President Murder In Us
అమెరికాలో యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు దారుణ హత్య

Hamas Hostage Release : 'హమాస్​ చెరలో 210 బందీలు'.. గాజాకు 200 ట్రక్కుల్లో 3వేల టన్నుల సామగ్రి!

Israel Hamas War : గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యం! ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్.. అమెరికా 100 బిలియన్ డాలర్ల ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.