ETV Bharat / international

బిక్కుబిక్కుమంటూ 14వేల మంది- ఆస్పత్రిలో కరెంట్​ కట్, జనరేటర్​ కూడా లేక - israel gaza war 2023

Israel Strike On Gaza Hospital : గాజాలో ఇజ్రాయెల్‌ భీకర దాడులు విరామం లేకుండా కొనసాగుతున్నాయి. గాజాలో అతిపెద్ద ఆస్పత్రి అల్‌షిఫా.. పరిసర ప్రాంతాల్లో IDF బలగాలు మోహరించి కాల్పుల మోత మోగిస్తున్నాయి. ఆస్పత్రిలో తలదాచుకున్న వేలాదిమంది క్షతగాత్రులు, శరణార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటు ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది.

Israel Strike On Gaza Hospital
Israel Strike On Gaza Hospital
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 10:17 PM IST

Israel Strike On Gaza Hospital : గాజాలోని అల్‌షిఫా ఆస్పత్రి వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్పత్రిని ఇజ్రాయెల్‌ బలగాలు చుట్టుముట్టి బాంబు దాడులు జరుపుతుండగా.. అందులో తలదాచుకున్న 14 వేలమందికి పైగా శరణార్థులు, వైద్యులు, క్షతగాత్రులు.. భయంతో గడుపుతున్నారు. ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచి.. చివరి జనరేటర్‌ పనిచేయడం ఆగిపోవడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది.

37మంది శిశువుల ప్రాణాలు!
Israel Attack On Gaza Hospital Today : చికిత్స అందక ఇద్దరు శిశువులు సహా మరో నలుగురు క్షతగాత్రులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. మరో 37 మంది శిశువుల ప్రాణాలు ఆందోళనకరంగా ఉన్నాయని వివరించింది. అయితే అల్‌షిఫా ఆస్పత్రిలో హమాస్‌ కీలక స్థావరం ఉందని ఐడీఎఫ్​ చెబుతోంది. అయితే ఇందుకు ఎలాంటి ఆధారాలు చూపించడం లేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆ ఆస్పత్రితో సంబంధాలు తెగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తంచేసింది.

Israel Strike On Gaza Hospital
గాజాపై ఇజ్రాయెల్​ దాడి

ప్రపంచానికి వ్యతిరేకంగానైనా..
Israel On Gaza Hospital Bombing : పౌర మరణాలు పెరుగుతుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌తోపాటు ఫ్రాన్స్‌ కూడా యుద్ధ విరమణ చేయాల్సిందేనని సూచించింది. మిత్ర దేశాల నుంచి కూడా మద్దతు తగ్గుతుండటం వల్ల ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు స్పందించారు. తమ ప్రతిజ్ఞ కోసం యావత్‌ ప్రపంచానికి వ్యతిరేకంగా వెళ్లడానికైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు.

Israel Strike On Gaza Hospital
గాజాలో ధంసమైన భవనాలు

సురక్షితమే ప్రదేశమే లేకుండా!
Israel Attack On Gaza Latest News : తాము విజయం సాధిస్తే స్వేచ్ఛా ప్రపంచానికి విజయం లభించినట్లేనని వివరించారు. పాలస్తీనా అథారిటీని గాజాలోకి అనుమతించేది లేదన్న సంకేతాలను నెతన్యాహు ఇచ్చారు. తమను అంతర్జాతీయ ఒత్తిళ్లు ప్రభావితం చేయబోవన్నారు. ఉత్తర గాజాతో హమాస్‌కు సంబంధాలన్నీ తెగిపోయాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం అక్కడ హమాస్‌కు సురక్షిత ప్రదేశమే లేకుండా చేశామని ప్రకటించారు.

Israel Strike On Gaza Hospital
గాజాలో భయానక దృశ్యాలు

మరోవైపు గాజా ప్రజలపై ఇజ్రాయెల్‌ దాడులను అమెరికా సహా పాశ్చాత్య దేశాలు తప్పుబడుతున్నాయి. హమాస్‌తో సంబంధం లేని ప్రజలు వేల మంది చనిపోతున్నారని ఇజ్రాయెల్‌కు ముందు నుంచి మద్దతిస్తున్న అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ బాంబులతో చిన్నారులు, మహిళలు మరణిస్తున్నారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌ దాడులను అరబ్‌ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.

అతిపెద్ద ఆస్పత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్​ దళాలు- పసికందుల ప్రాణాలకు ముప్పు?

యుద్ధం తర్వాత గాజాను పాలించేదెవరు? కాల్పుల విరమణకు నెతన్యాహూ నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.