ETV Bharat / international

Israel Hamas War : యుద్ధ విస్తరణ సంకేతాలు.. హమాస్​ కోసం రంగంలోకి అరబ్ దేశాలు? ఇజ్రాయెల్​కు మద్దతిచ్చేదెవరంటే? - palestine and israel conflict

Israel Hamas War : వైమానిక దాడులతో గాజాస్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌ నామరూపాలు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​పై లెబనాన్‌, సిరియా నుంచి మిలిటెంట్ల దాడులు మొదలయ్యాయి. దీంతో యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

israel hamas war reason
israel palestine war
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 7:41 AM IST

Updated : Oct 12, 2023, 11:51 AM IST

Israel Hamas War : పాలస్తీనాపై సాగుతున్న ఇజ్రాయెల్‌ యుద్ధం అక్కడితో ఆగుతుందా? విస్తరిస్తుందా? ఇతర దేశాలూ ఇందులో అడుగుపెడతాయా? బుధవారంనాటి పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్‌ దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరి అవుతుండగా... మరోవైపు, లెబనాన్‌, సిరియాల నుంచీ ఇజ్రాయెల్‌ వైపు రాకెట్లు దూసుకురావడం, ఖతార్‌, ఇరాన్‌లాంటివి పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌కు పూర్తిగా అండగా ఉంటామని అమెరికా, ఈయూ దేశాలు ప్రకటించడం ఐక్యరాజ్య సమితి సహా అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది.

వారూ దిగితే..
Israel War Escalation : పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌పై గాజాలో ఇజ్రాయెల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్​పై బుధవారం మరోవైపు నుంచి దాడి ఎదురైంది. పక్కనున్న లెబనాన్‌, సిరియాల్లో హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్‌ దళాలు ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. అసలే గాజాలో ఇజ్రాయెల్‌ దాడులతో పరిస్థితి దిగజారుతుందని భావిస్తున్న ఐక్యరాజ్య సమితి.. సిరియా, లెబనాన్‌ల నుంచి దాడులతో మరింత ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది.

హమాస్‌కు సిరియా, లెబనాన్‌ మద్దతుగా ఉంటాయి. ఈ రెండూ కదనరంగంలోకి దిగితే ఇజ్రాయెల్‌ మూడు వైపులా యుద్ధం చేయాల్సి వస్తుంది. అన్నింటికీ మించి... ఇజ్రాయెలీలపై హమాస్‌ దాడిలో ఇరాన్‌ ప్రమేయం ఉందని నిర్ధరణ అయితే పరిస్థితి మరింత దిగజారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్‌, సిరియాలతో పాటు ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌ హమాస్‌కు మద్దతు ఇస్తున్నాయి. హమాస్‌ తీవ్రవాదులకు ఇరాన్‌ అన్ని విధాలుగా అండగా ఉంటుందనే విషయం బహిరంగ రహస్యమే. ఈ దేశాలన్నీ హమాస్‌కు మద్దతుగా నిలిస్తే యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

అరబ్‌ ఐక్యతకు చిల్లు?
అయితే, హమాస్​కు పశ్చిమాసియాలోని అన్ని అరబ్‌ దేశాల నుంచి మద్దతు లభించకపోవచ్చని తెలుస్తోంది. అనేక అరబ్ దేశాలు 50 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్​పై వ్యక్తం చేసిన వ్యతిరేకతను ఇప్పుడు ప్రదర్శించడం లేదు. పాలస్తీనా పట్ల సానుభూతి, సానుకూలత ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. ఈజిప్టు, బహ్రెయిన్‌, యూఏఈ హమాస్‌ దాడిని తీవ్రంగా ఖండించగా... కీలకమైన సౌదీ అరేబియా ఎవరి పక్షం వహించకుండా లౌక్యంగా తటస్థంగా ఉండే ప్రయత్నం చేయడం విశేషం. అంటే ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత విషయంలో అరబ్‌లీగ్‌లోనే ఐక్యత లేదు.

Israel Palestine Conflict : ఇజ్రాయెల్​-పాలస్తీనా గొడవకు కారణం ఇదే!.. 'హమాస్​' ఎలా ఏర్పడిందంటే?

Israel Hezbollah War : ఇజ్రాయెల్‌ X హమాస్‌.. యుద్ధంలోకి 'హెజ్బొల్లా' సంస్థ ఎంట్రీ.. రాకెట్లు, షెల్స్​తో దాడి..

Last Updated : Oct 12, 2023, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.