ETV Bharat / international

Israel Hamas War 2023 : చిన్నారులు, మహిళలపై హమాస్ ఆకృత్యాలు.. చేతులకు సంకెళ్లు వేసి కాల్పులు.. 'జాంబీ' సినిమా తరహాలో.. - ఇజ్రాయెల్​పై జాంబో తరహా దాడులు

Israel Hamas War 2023 : శనివారం ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ పాల్పడిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చిన్నారులు, మహిళల చేతులకు సంకెళ్లు వేసి మరీ కాల్చి చంపారని, తలలు తెగనరికారని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఆ దృశ్యాలు జాంబీ సినిమా సీన్లను తలపిస్తున్నాయని పేర్కొంది. తమ దేశంలోకి చొరబడి మారణహోమానికి పాల్పడిన హమాస్‌ను భూస్థాపితం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. హమాస్‌ను పురుగులా నలిపేస్తామని, దాని ఉనికే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

israel hamas war 2023
israel hamas war 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 3:42 PM IST

Israel Hamas War 2023 : ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ జరిపిన నరమేధం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పసిపిల్లలు, మహిళలను కూడా చూడకుండా అతి కిరాతంగా వారిని చంపేశారు. ఆ భయానక వీడియోలను హమాస్‌ మద్దతుదారులే సోషల్‌ మీడియాలో పోస్టు చేసుకొంటున్నారు. ఘటనా స్థలాల్లోని దృశ్యాలు జాంబీ సినిమా సీన్లను తలపిస్తున్నాయని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది.

  • #WATCH | On the Israel-Palestine conflict, IDF Spokesperson Jonathan Conricus says "The scenes are out of a zombie movie. It is a war zone...Many body bags were evacuated from that Kibbutz, including those of children and babies. We got very disturbing reports that came from the… pic.twitter.com/yYxpijodPr

    — ANI (@ANI) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శనివారం దాదాపు 3 వేల మంది హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) అంచనా వేసింది. వీరిలో 1500 మందిని ఇజ్రాయెల్‌ భద్రతా బలగాలు హతమార్చగా.. మరో 1500 మంది తిరిగి గాజాకు పారిపోయినట్లు భావిస్తున్నారు. వందల మందిని బందీలుగా చేసుకుని హమాస్‌ ఉగ్రవాదులు అతి దారుణంగా చంపేశారని ఐడీఎఫ్‌ ప్రకటించింది. చిన్నారుల తలలు తెగనరికారని, మహిళలు, పిల్లల చేతికి సంకెళ్లు వేసి వారి నుదిటిపై కాల్పులు జరిపి చంపేశారని వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు ఆ దారుణాలను స్వయంగా చూసి చెప్పినట్లు వెల్లడించింది. హమాస్‌ మిలిటెంట్లు చిన్నారుల తలలు నరికి చంపినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని IDF పేర్కొంది.

Israel Hamas War 2023
ఇజ్రాయెల్​పై హమాస్ దాడులు

హమాస్‌ దాడులకు పాల్పడిన ప్రాంతాలకు ఇజ్రాయెల్‌ బలగాలు వెళ్లి చూస్తే అక్కడ జాంబీ సినిమాలాంటి భయానక దృశ్యాలు కన్పించినట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి జొనాథన్‌ కాన్రికస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హమాస్‌ ఉగ్రవాదుల చెరలో దాదాపు 150 మంది ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులు బందీలుగా ఉన్నట్లు సమాచారం.

Israel Hamas War 2023
ఇజ్రాయెల్​పై హమాస్ దాడులు

మరోవైపు హమాస్‌ ఉగ్రవాదులకు కేంద్రమైన గాజాలో దాడులు మరింత తీవ్రం చేసేందుకు ఇజ్రాయెల్‌ సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా యుద్ధకాల అత్యవసర సమైక్య ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీల ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహు బుధవారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. హమాస్‌కు గట్టి హెచ్చరికలు చేశారు. గాజాలో అతిత్వరలో క్షేత్రస్థాయిలో దాడులు చేపడతామన్నారు. హమాస్‌ గ్రూప్‌ ఉనికి ఈ భూమిపైనే లేకుండా చేస్తామన్నారు. ప్రతి హమాస్‌ సభ్యుడు మూల్యం చెల్లించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

Israel Hamas War 2023
ఇజ్రాయెల్​పై హమాస్ దాడులు
Israel Hamas War 2023
ఇజ్రాయెల్​పై హమాస్ దాడులు

ప్రధానితో బ్లింకెన్ భేటీ..
మరోవైపు ఇజ్రాయెల్​లోని టెల్​ అవీవ్​లో ఆ దేశ ప్రధానిని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కలిశారు. వీరిద్దరూ యుద్ధ పరిస్థితిపై ముచ్చటించారు. 'మేము ఇక్కడే ఉన్నాం. ఎక్కడికి వెళ్లడం లేదు' అని బ్లింకెన్​.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు భరోసా ఇచ్చారు. ఇజ్రాయెల్​కు అమెరికా అండగా ఉంటుందని తెలిపారు.

  • #WATCH | US Secretary of State, Antony Blinken meets Israeli PM Benjamin Netanyahu in Tel Aviv

    "We are here. We are not going anywhere," Blinken to Netanyahu in their meeting.

    (Source: Reuters) pic.twitter.com/AYedP6F3NI

Israel Hamas War : యుద్ధ విస్తరణ సంకేతాలు.. హమాస్​ కోసం రంగంలోకి అరబ్ దేశాలు? ఇజ్రాయెల్​కు మద్దతిచ్చేదెవరంటే?

Israel Palestine War : 'గుడారాల నగరంగా గాజా!'.. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి ఇజ్రాయెల్​ సిద్ధం

Operation Ajay Israel India : ఇజ్రాయెల్​ X హమాస్​.. భారతీయులను తరలించడానికి 'ఆపరేషన్​ అజయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.