ETV Bharat / international

Israel Ground Attack On Gaza : '24 గంటల్లో గాజాను వీడండి'.. పౌరులకు ఇజ్రాయెల్​ ఆదేశాలు.. గ్రౌండ్​ ఆపరేషన్​కు రెడీ! - ఇజ్రాయెల్​ హమాస్ వార్ అప్డేట్స్

Israel Ground Attack On Gaza : గాజా స్ట్రిప్‌పై భూతల దాడులకు దిగేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధమవుతోంది. 24 గంటల్లోగా ఉత్తర గాజాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని అక్కడ ఉన్న 11 లక్షల మందిని ఇజ్రాయెల్‌ సైన్యం ఆదేశించింది. అయితే అది సాధ్యం కాదన్న ఐక్య రాజ్య సమితి.. అలా చేస్తే వినాశకరమైన మానవతా సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించింది. 24 గంటల గడువు ముగిసిన తర్వాత ఇజ్రాయెల్‌ భూతల దాడికి దిగితే భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో గాజాలో 1500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Israel Ground Attack On Gaza
Israel Ground Attack On Gaza
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 11:27 AM IST

Israel Ground Attack On Gaza : గాజా స్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేసి వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌.. భూతల దాడులకు కూడా సిద్ధమవుతోంది. తమ దేశంపై దాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్‌ సంస్థలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్న ఇజ్రాయెల్‌.. ఇప్పటికే భారీ సంఖ్యలో సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, సైనికులను మోహరించింది. గాజాస్ట్రిప్‌లో దాదాపు 23 లక్షల మంది ఉండగా 24 గంటల్లోగా ఉత్తరగాజాలో ఉన్న 11 లక్షల మంది ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ ఆదేశాలు జారీ చేసింది. గాజాలోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం సిద్ధమవుతున్న వేళ.. ఆ దేశం నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితికి కూడా ఇజ్రాయెల్‌ సమాచారం ఇచ్చింది.

'మానవతా సంక్షోభానికి దారి తీస్తుంది'
Israel Gaza Conflict : అయితే ఉత్తర గాజాలో నివాసం ఉంటున్న 11 లక్షల మంది ఖాళీ చేయడం అసాధ్యమని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ వెల్లడించారు. అది వినాశకరమైన మానవతా సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించారు. గాజాపై భూతల దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే గాజాస్ట్రిప్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఏ ఒక్క మిలిటెంట్‌నూ వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.

Israel Ground Operation : మరోవైపు గాజాలో పూర్తిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వల్ల బుధవారం రాత్రంతా ప్రజలు చీకట్లోనే గడిపారు. గురువారం బేకరీలు, కిరాణా దుకాణాల ఎదుట ఆహారం కోసం క్యూ కట్టారు. కొద్ది సేపట్లోనే దుకాణాల్లో అన్నీ నిండుకున్నాయి. ఇజ్రాయెల్‌ ఆహారం, ఇంధనం, విద్యుత్తు నిలిపేయడం వల్ల గాజాలో ప్రజలు ఆకలికి అలమటించి చనిపోతారేమోననే ఆందోళనను అంతర్జాతీయ సహాయక బృందాలు వ్యక్తం చేశాయి. ఈజిప్టు సరిహద్దు కూడా మూసి ఉండటం వల్ల వారికి మరో దారిలేదని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌ బాంబు దాడులతో విరుచుకుపడుతుండటం వల్ల తమ సామగ్రిని తీసుకుని సురక్షిత ప్రాంతం కోసం గాజా వాసులు వీధుల్లో పరుగెత్తుతున్నారు. లక్షల మంది ప్రజలు ఐక్యరాజ్య సమితి నడుపుతున్న షెల్టర్లలోకి పోటెత్తుతున్నారు.

ఆసుపత్రుల్లో అంధకారం
Israel Ground Invasion Gaza : మరోవైపు, విద్యుత్తు సరఫరా లేకపోవడం వల్ల ఆసుపత్రుల్లో అంధకారం నెలకొంది. డయాలసిస్‌ను ఆపేశామని, కొత్తగా పుట్టే బిడ్డలకు, చికిత్స పొందుతున్న వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని రెడ్‌ క్రాస్‌ ప్రతినిధి తెలిపారు. బందీలను విడిచిపెట్టేదాకా గాజాకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేది లేదని ఇజ్రాయెల్‌ తేల్చి చెప్పింది. కనీసం నీరు కూడా అందించమని తెలిపింది.

Israel Ground Attack : హమాస్​ను మట్టుబెట్టేందుకు మాస్టర్​ ప్లాన్​.. గ్రౌండ్ ఆపరేషన్​కు ఇజ్రాయెల్ రెడీ

Israel Palestine War : 'గుడారాల నగరంగా గాజా!'.. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి ఇజ్రాయెల్​ సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.