ఒకప్పుడు దేశ జనాభాలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేది. ఇప్పుడు ప్రపంచీకరణ కారణంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. 2035 నాటికి దేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య 67 కోట్ల 50 లక్షలకు చేరనుందని 'ఐక్యరాజ్య సమితి హాబిటాట్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్- 2022' వెల్లడించింది. అదే సమయానికి చైనాలో పట్టణ ప్రాంతాల్లో 100 కోట్లకుపైగా జనాభా ఉండనుంది. ఆ తర్వాతి స్థానం భారత్‌దే కావడం గమనార్హం. 2020 లెక్కల ప్రకారం భారత్‌లో పట్టణ ప్రాంతాల్లో 48 కోట్ల మంది నివసిస్తున్నారు. అది 2025 కల్లా 54 కోట్లకు 2030కల్లా 60 కోట్లకు చేరనుంది.
- కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది.
- ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 56 శాతం పట్టణాల్లో నివసిస్తున్నారు.
- 2050 నాటికి ప్రపంచంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే జనాభా సంఖ్య 220 కోట్లకు(68 శాతం) చేరనుంది.
- చైనాలో 2035 నాటికి పట్టణ ప్రాంత జనాభా సంఖ్య 100 కోట్లను దాటనుంది.
- పట్టణ జనాభా పెరగడం సహా ఆర్థికంగా వేగంగా పురోగమిస్తున్న ఆసియా దేశాల్లో చైనా, భారత్ ముందున్నాయి.
- పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల వాయు కాలుష్యానికి కూడా కారణమవుతోంది.
ఇదీ చూడండి: 'ఆ దేశంతోనే నాటో భాగస్వామ్య దేశాలకు ముప్పు'