ETV Bharat / international

అమెరికాలో ఉన్నత విద్యకు భారతీయులు మొగ్గు- ఎంత మంది చదువుతున్నారంటే? - అమెరికా యూనివర్సిటీలో భారతీయ స్టూడెంట్స్

Indian Students In American Universities : అమెరికాలో ఉన్నత విద్య చదవాలని ఆశిస్తుంటారు చాలా మంది విద్యార్థులు. ఎంత ఖర్చైనా అగ్రరాజ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. 2022-23 విద్యా సంవత్సరానికి అమెరికా యూనివర్సిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. మరి అందులో భారతీయ విద్యార్థులు ఎంత మందో తెలుసా?

Indian Students In American Universities

author img

By PTI

Published : Nov 13, 2023, 5:38 PM IST

Indian Students In American Universities : అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఈ క్రమంలో అమెరికాలోని యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం విదేశీ విద్యార్థుల తాకిడి పెరుగుతోంది. తాజాగా అది కొవిడ్​ మహమ్మారి మునుపటి స్థితికి చేరుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఓపెన్‌ డోర్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ గణాంకాల ప్రకారం.. 2022-23 విద్యా సంవత్సరానికి అమెరికా యూనివర్సిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12శాతం పెరిగింది. గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే గరిష్ఠం. ఈ ఏడాది విదేశీ విద్యార్థుల్లో భారత్‌ నుంచి వచ్చిన వారిలో 35 శాతం పెరుగుదల కనిపించింది.

భారత్ నుంచి భారీ సంఖ్యలో..
అమెరికా యూనివర్సిటీల్లో నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల్లో​ చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. చైనా నుంచి దాదాపు 2.9 లక్షల మంది (27శాతం) నమోదు చేసుకోగా.. రెండో స్థానంలో ఉన్న భారత్‌ నుంచి 2,69,000 మంది (25శాతం) అమెరికాలో ఉన్నత చదువుల కోసం వివిధ యూనివర్సిటీల్లో నమోదు చేసుకున్నారు. ఈ రెండు దేశాల నుంచే 53శాతం మంది ఉంటున్నారు. భారత్‌ నుంచి ఏటా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనా నుంచి గత 3 ఏళ్లుగా తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్‌ తర్వాత దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్‌, నైజీరియా దేశాలున్నాయి. ఈ ఏడాది మాత్రం బంగ్లాదేశ్‌ (28%), కొలంబియా, ఘనా ((32%)), భారత్‌ (35%), ఇటలీ, నేపాల్‌ (28%), పాకిస్థాన్‌ (16%), స్పెయిన్‌ నుంచి అమెరికా బాట పట్టిన విద్యార్థుల్లో భారీ పెరుగుదల కనిపించింది.

అమెరికా గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్‌, టెక్నాలజీ, బిజినెస్‌ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రామ్‌లలో 21 శాతం పెరుగుదల కనిపించగా.. యూజీల్లో ఒక శాతం పెరిగింది. గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజినీరింగ్‌, బిజినెస్‌ విభాగాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇలినోయ్‌, టెక్సాస్‌, మిషిగాన్‌లు సహా 24 రాష్ట్రాల్లో చైనా కంటే భారతీయ విద్యార్థులే అధికంగా ఉంటున్నారు.

కొవిడ్​కు ముందు (2018లో) అమెరికా ఉన్నత విద్య కోసం నమోదు చేసుకునే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య (2015-16 నుంచి) ఏటా సుమారు 11 లక్షలుగా ఉంటోంది. కొవిడ్‌ తర్వాత రెండేళ్లపాటు ఈ సంఖ్య తగ్గింది. తాజాగా క్రమంగా పెరుగుతూ ఈ ఏడాది మళ్లీ 11లక్షలకు చేరువైంది. ఇలా విదేశీ విద్యార్థులను గణనీయంగా ఆకర్షిస్తున్నప్పటికీ.. స్థానిక విద్యార్థులను రప్పించడంలో అమెరికా ఉన్నత విద్యా సంస్థలు కష్టాలు పడుతున్నట్లు నివేదికలు చెబుతుండడం విశేషం.

ఇలా విదేశాల్లో ఉన్నత చదువు కోసం ప్రయత్నించే అంతర్జాతీయ విద్యార్థులకు గత వందేళ్లుగా అమెరికానే గమ్యస్థానంగా ఉందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సీఈఓ అల్లాన్‌ గుడ్‌మ్యాన్‌ పేర్కొన్నారు. విద్య విషయంలో భారత్‌తో అమెరికా బలమైన భాగస్వామ్యం కలిగి ఉందని.. ఇది మరింత బలోపేతం అవుతోందని విదేశాంగ శాఖ విద్యా విభాగానికి చెందిన మారియిఎన్‌ తెలిపారు.

బ్రిటన్​ హోంమంత్రికి సునాక్​ ఉద్వాసన- ఆ వ్యాఖ్యలే కారణం!

'మమ్మల్ని గెంటేశారు- వియన్నా ఒప్పందం ఉల్లంఘిస్తున్నారు'- మళ్లీ నోరు పారేసుకున్న ట్రూడో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.