India Help Palestine : ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా పెద్దఎత్తున నష్టపోయిన పాలస్తీనా వాసులను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. ఆ దేశానికి మానవతా సాయం కింద తక్షణమే 38.5 టన్నుల వైద్య, విపత్తు సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో 6.5 టన్నుల వైద్యానికి సంబంధించిన వస్తువులు, 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రి ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆదివారం వెల్లడించారు.
ఈ వైద్య సామగ్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే మందులతో పాటు పెయిన్‌కిల్లర్స్, ఫ్లుయిడ్స్, ఇతర ఔషధాలు, శస్త్రచికిత్సలకు కావాల్సిన పరికరాలు ఉన్నాయని బాగ్చీ తెలిపారు. అలాగే విపత్తు నివారణ కోసం అవసరమైన సామగ్రిలో టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్‌లు, ప్రాథమికంగా ఉపయోగపడే శానిటరీ వస్తువులు, నీటి శుద్ధీకరణ మాత్రలతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వీటన్నింటిని తీసుకొని భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానం C17.. పాలస్తీనాకు బయలుదేరిందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
-
#WATCH | Hindon Air Base, Ghaziabad (Uttar Pradesh) | An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
— ANI (@ANI) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The material includes essential life-saving… pic.twitter.com/HF5WJNAB58
">#WATCH | Hindon Air Base, Ghaziabad (Uttar Pradesh) | An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
— ANI (@ANI) October 22, 2023
The material includes essential life-saving… pic.twitter.com/HF5WJNAB58#WATCH | Hindon Air Base, Ghaziabad (Uttar Pradesh) | An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt.
— ANI (@ANI) October 22, 2023
The material includes essential life-saving… pic.twitter.com/HF5WJNAB58
"ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్ సిద్ధమైంది. మానవతా సాయం కింద ఆ దేశానికి 38.5 టన్నుల ఔషధాలు, వైద్య పరికరాలను పంపించింది. వీటితో పాటు విపత్తు నివారణకు ఉపయోగపడే సామగ్రితో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన C17 ప్రత్యేక విమానం ఇప్పటికే ఆ దేశానికి బయలుదేరింది."
- అరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
India Aid To Palestine : సహాయ సామగ్రితో కూడిన C17 ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 8 గంటలకు హిండన్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరింది. ఈ విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరీష్ ఎయిర్‌పోర్ట్‌కు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా యుద్ధ ప్రభావిత ప్రాంతమైన గాజాకు వీటిని తీసుకెళ్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు మానవతా సాయం కింద ఇతర దేశాల నుంచి కూడా గాజాకు వైద్య సహాయం అందుతున్నప్పటికీ.. గాజాలో రహదారులన్నీ తీవ్రంగా ధ్వంసం కావడం వల్ల అవి వేగంగా పాలస్తీనా పౌరులకు చేరడం లేదని తెలుస్తోంది.
-
"🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸! An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt," posts @MEAIndia
— Press Trust of India (@PTI_News) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
"The material includes essential life-saving… pic.twitter.com/3emcoNkzMw
">"🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸! An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt," posts @MEAIndia
— Press Trust of India (@PTI_News) October 22, 2023
"The material includes essential life-saving… pic.twitter.com/3emcoNkzMw"🇮🇳 sends Humanitarian aid to the people of 🇵🇸! An IAF C-17 flight carrying nearly 6.5 tonnes of medical aid and 32 tonnes of disaster relief material for the people of Palestine departs for El-Arish airport in Egypt," posts @MEAIndia
— Press Trust of India (@PTI_News) October 22, 2023
"The material includes essential life-saving… pic.twitter.com/3emcoNkzMw
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ హెచ్చరిక..
అమెరికా, ఐరాస సహా పలు దేశాలు ఒత్తిడితో ఎట్టకేలకు శనివారం ఈజిప్ట్ సరిహద్దు రఫా ద్వారా గాజాలోకి మానవతా సాయాన్ని తరలించేందుకు 20 ట్రక్కులను ఇజ్రాయెల్ అధికారులు గాజాలోకి అనుమతించారు. అయితే 2 మిలియన్లకుపైగా జనాభా ఉన్న ఎన్‌క్లేవ్‌లో అవసరాలు చాలా ఎక్కువని.. ప్రస్తుతం అందుతున్న సాయం ఏ మాత్రం సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. మరోవైపు గాజాలో ప్రస్తుతం 60 శాతానికిపైగా సౌకర్యాలు మూతపడ్డాయి. అలాగే గాజాలోని ఆస్పత్రులు పతనం అంచున అన్నాయని.. ప్రధానంగా విద్యుత్, ఔషధాలు, వైద్య పరికరాలు సహా ప్రత్యేక సిబ్బంది కొరత కూడా ఇక్కడ అధికంగా ఉందని ఐక్యరాజ్య సమితి నొక్కిచెప్పింది.
మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటాం : ప్రధాని మోదీ
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మూడు రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్రమోదీ పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధైర్య పడవద్దని.. పాలస్తీనా ప్రజలకు భారత్ మానవతా సాయాన్ని పంపిస్తూనే ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు.
"ఆ ప్రాంతంలో ఉగ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై మా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశం అనుసరిస్తున్న దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటిస్తున్నాం."
-ట్విట్టర్లో ప్రధాని మోదీ
4వేలకుపైగా పాలస్తీనియన్లు మృతి!
ఈనెల 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. దాంతో ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) దేశంలో హమాస్ ఉనికే లేకుండా చేసేందుకు గాజాపై ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలోనే సాధారణ పాలస్తీనా ప్రజలు అనేక మంది ఈ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో 4,300 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. అయితే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపైనే ఐడీఎఫ్ దాడులు చేయడం వల్ల అత్యధిక స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. అలాగే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా సంభవించింది.
Hamas Hostage Release : 'హమాస్ చెరలో 210 బందీలు'.. గాజాకు 200 ట్రక్కుల్లో 3వేల టన్నుల సామగ్రి!