ETV Bharat / international

అల్‌షిఫా ఆస్పత్రిలోకి ఇజ్రాయెల్ దళాలు- హమాస్ ముష్కరులకు అల్టిమేటం- కమాండ్ సెంటర్ అక్కడే! - ఆస్పత్రిపై ఇజ్రాయెల్​ దాడి

Gaza Hospital Raid : గాజాలో హమాస్‌ మిలిటెంట్ల కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న.. అల్ షిఫా ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్నాయి ఇజ్రాయెల్‌ దళాలు. రోజుల పాటు పక్కాగా రెక్కీ నిర్వహించి, ఆస్పత్రిలో ఎలా వ్యవహరించాలో సైనికులకు శిక్షణ ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌ దళాలు ఆస్పత్రిలోకి ప్రవేశించాయి. యుద్ధ ట్యాంకులు, సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. మరోవైపు అల్‌ షిఫా ఆస్పత్రి కింద హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ ఉందని అమెరికా తొలిసారి సంచలన ప్రకటన చేసింది. అగ్రరాజ్య నిఘా వర్గాలు ఆ సమాచారాన్ని అందించాయని తెలిపింది. అయితే గాజాను స్మశానంగా మార్చేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా అనుమతి ఇచ్చిందని హమాస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది.

gaza hospital raid
gaza hospital raid
author img

By PTI

Published : Nov 15, 2023, 2:00 PM IST

Gaza Hospital Raid : హ‌మాస్ మిలిటెంట్లను వెంటాడుతున్న ఇజ్రాయిల్ ర‌క్షణ ద‌ళాలు.. గాజాలో హమాస్‌ కమాండ్‌ సెంటర్‌గా భావిస్తున్న అల్‌షిఫా ఆస్పత్రిలోకి ప్రవేశించాయి. యుద్ధ ట్యాంకులు, సుశిక్షితులైన సైనికులతో ఇజ్రాయెల్‌ బలగాలు.. ఆస్పత్రి అత్యవసర విభాగంలోకి దూసుకెళ్లాయి. మ‌రుభూమిగా మారిన అల్‌-షిఫాను... హ‌మాస్ మిలిటెంట్ల చెరనుంచి విముక్తి చేసే ల‌క్ష్యంతో ఆస్పత్రిలోకి ప్రవేశించినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

Gaza Hospital News Today : ఆస్పత్రిలో దాక్కొన్న హమాస్‌ దళాలు లొంగిపోవాలని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అల్ షిఫా ఆస్పత్రి పరిసరాల్లో హ‌మాస్ మిలిటెంట్లతో ఇజ్రాయిల్ ద‌ళాలు పోరాడుతున్నట్లు చెప్పింది. అల్‌ షిఫా ఆస్పత్రిలో కచ్చితమైన సమాచారంతో లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. ఈ దాడిలో వైద్య సిబ్బంది, అరబిక్‌ భాష తెలిసిన వారిని వెంట తీసుకెళ్లినట్లు వెల్లడించింది. ఇక్కడ దాడి నిర్వహించడం కోసం దళాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించినట్లు తెలిపింది. రోగులకు హాని జ‌ర‌గ‌కుండా, వైద్య సిబ్బంది, పౌరుల‌కు ఏమీ కాకుండా ఉగ్రవాదుల‌ను త‌రిమివేయ‌నున్నట్లు ఇజ్రాయిల్ ద‌ళాలు వెల్ల‌డించాయి.

అల్‌ షిఫా ఆస్పత్రి లోపల సాయుధ కార్యకలాపాలన్నీ 12 గంటల్లో నిలిపేయాలని ఇజ్రాయెల్‌ ఒక ప్రకటనలో హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్లు కూడా లొంగిపోవాలని కోరింది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం అల్‌ షిఫా ఆస్పత్రిలో నవ జాత శిశువులు సహా 2 వేల 300 మంది రోగులు ఉన్నారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంతో వీరందరూ అక్కడే చిక్కుకుపోయారు. అల్‌ షిఫా ఆస్పత్రి ఇప్పుడు ఇజ్రాయెల్‌ ఆధీనంలోకి వస్తే రోగులను వేరే ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది.

'ఆస్పత్రి కింద హమాస్‌ కమాండ్‌ సెంటర్‌'
మరోవైపు గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్‌-షిఫాపై అమెరికా తొలిసారి సంచలన ప్రకటన చేసింది. ఆ ఆస్పత్రి కింద హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ ఉందని తమకు ఇంటెలిజెన్స్‌ సమాచారం లభించిందని అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కోఆర్డినేటర్‌ జాన్‌ కిర్బీ ప్రకటించారు. అల్‌-షిఫా ఆస్పత్రి కింద హమాస్‌ భారీగా ఆయుధాలను భద్రపర్చిందని వివరించారు. ఆ ఆస్పత్రిలోకి ప్రవేశించిన తర్వాత తొలిసారి అమెరికా నుంచి ఇజ్రాయెల్‌ దళాలకు మద్దతు లభించింది.

హమాస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థలు గాజాలోని ఆస్పత్రుల కింద సొరంగాలను సైనిక కార్యకలాపాలకు, బందీలను దాచేందుకు వాడుతున్నట్లు నిఘా సమాచారం ఆధారంగానే గుర్తించామని అమెరికా తెలిపింది. ఆస్పత్రి కింద హమాస్‌ మిలిటెంట్లు ఆయుధాలను దాచారని.. ఇజ్రాయెలీ దాడులకు బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నారని అగ్రరాజ్యం వెల్లడించింది. కానీ అమాయక ప్రజలు ఉన్న చోట వైమానిక దాడులు చేయడాన్ని, కాల్పులు జరపడాన్ని తాము సమర్థించబోమని ఇజ్రాయెల్‌కు స్పష్టం చేసింది అమెరికా. గాజా పౌరులను రక్షించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్‌కు ఉందని స్పష్టం చేసింది. అమెరికా ప్రకటనపై హమాస్‌ భగ్గుమంది. ఆస్పత్రులపై తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి, గాజా వైద్య వ్యవస్థను ధ్వంసం చేయడానికి అగ్రరాజ్యం.. ఇజ్రాయెల్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని ఆరోపించింది.

'గాజాపై పట్టుకోల్పోయిన హమాస్'- ఆస్పత్రి కేంద్రంగా భీకర పోరు, శవాలను పీక్కుతింటున్న శునకాలు!

'హమాస్​కు రక్షణ కవచాలుగా ఆస్పత్రులు- ఇంధనం ఇచ్చినా నిరాకరిస్తున్న మిలిటెంట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.