ETV Bharat / international

నీటిలో నుంచి ఎగిరి మనిషి గొంతులోకి చేప.. ఊపిరాడక బాధితుడు విలవిల

Fish struck in mouth: ఓ చేప నీటిలో నుంచి ఎగిరి మనిషి గొంతులోకి చొచ్చుకెళ్లింది. బయటకు రాలేక నోట్లోనే ఇరుక్కుని అతనికి ఊపిరాడకుండా చేసింది. చివరకు వైద్యులు తీవ్రంగా శ్రమించి అతని ప్రాణాలు కాపాడారు. థాయ్​లాండ్​లో ఈ ఘటన జరిగింది.

fish jumps into mans mouth
నీటిలో నుంచి ఎగిరి మనిషి గొంతులోకి దూసుకెళ్లిన చేప
author img

By

Published : Jun 3, 2022, 1:23 PM IST

Fish jumps into mouth: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు అదృష్టం తలుపుతట్టి సర్​ప్రైజ్​​లు ఇస్తుంటుంది. మరికొన్నిసార్లు దురదృష్టం భరించలేని బాధలను తెస్తుంది. థాయ్​లాండ్​కు చెందిన ఓ వ్యక్తిగా సరిగ్గా ఇలాంటి పరిస్థితే వచ్చింది. సరదాగా చేపలవేటకు వెళ్లిన అతని గొంతులోకి ఓ చేప దూసుకెళ్లింది. బయటకు రాలేక నోట్లోనే ఇరుక్కుపోయి అతనికి ఊపిరాడకుండా చేసి ప్రాణాల మీదకు తెచ్చింది.

మే 22న పట్టాలంగ్ రాష్ట్రంలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించి అమెరికా వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సముద్రంలో స్పియర్​ ఫిషింగ్​కు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. అనాబస్ అని పిలిచే ఐదు అంగుళాల స్పైకీ ఫిష్ ​నీటిలో నుంచి ఎగిరి నేరుగా అతని గొంతులోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ముక్కులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి అతని గొంతు, నాసికరంద్రాల మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో అతను ఊపిరాడక విలవిల్లాడాడు. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు గమనించి అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

అతడి పరిస్థితి చూసిన వైద్యులు ఇలా అత్యంత అరుదుగా జరుగుతుందని చెప్పారు. గొంతు, నాసికారంద్రాల మధ్యలో చేప ఇరుక్కున్నట్లు ఎక్స్​రేలో తెలిసిందన్నారు. బాధితుడి అవయవాలకు ఎక్కువ హాని జరగకుండా చూసేందుకు ప్రయత్నించామన్నారు. చివరకు అతడి ప్రాణాలు కాపాడినట్లు వివరించారు.
అయితే ఇలాంటి అరుదైన ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనే సముద్రంలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి గొంతుకు నీడిల్ ఫిష్ గుచ్చుకుంది. దీంతో అతనికి తీవ్రగాయమైంది.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు బ్రిటన్‌​ ఆయుధాలు.. శిక్షణ ఇచ్చి మరీ.. అమెరికా బాటలోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.