ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు పిల్లలు సహా 8 మంది మృతి.. - అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. ఉటా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో 8 మంది మృత్యువాత పడ్డారు. అందులో ఐదుగురు పిల్లలు ఉన్నారు.

america shooting news
america shooting news
author img

By

Published : Jan 5, 2023, 11:09 AM IST

Updated : Jan 5, 2023, 11:25 AM IST

అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్​ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలు ఉన్నట్లు చెప్పారు.
ఓ ఇంట్లో సాధారణ తనిఖీ నిమిత్తం వెళ్లినప్పుడు ఈ మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుడు వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ హత్యలకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

ఎనోచ్​ నగరంలో 8000 మంది నివసిస్తారు. ఉటా రాజధాని సాల్ట్​ లేక్​ సిటీకి ఈ నగరం 245 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ఘటనపై ఉటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్​ కాక్స్​​ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్​ చేశారు.

Last Updated : Jan 5, 2023, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.