Drone Strike On Ship : భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడికి కారణమైన డ్రోన్ ఇరాన్ భూభాగం నుంచి బయలుదేరిందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. ఇటీవల ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్ వాణిజ్య నాకలపై తరచూ దాడులు జరగుతున్నట్లు పేర్కొంది. ఈ ఘటనతో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల పరిధి ఎర్ర సముద్రాన్ని దాటినట్లయిందని పెంటగాన్ తెలిపింది. అయితే శనివారం జరిగిన దాడి మాత్రం గుజరాత్ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో జరగడం గమనార్హం.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత నౌకలపై ఇరాన్ దాడి చేస్తుందని అమెరికా బహిరంగంగా ఆరోపించడం ఇదే తొలిసారి. తాజాగా దాడికి గురైన నౌక లైబీరియన్ జెండాతో వస్తోందని, అది డచ్ సంస్థకు చెందినదని పెంటగాన్ తెలిపింది. కానీ ప్రస్తుతం అది జపాన్‌కు చెందిన ఓ కంపెనీ నిర్వహణలో ఉన్నట్లు వెల్లడించింది.
అయితే, ఈ నౌకకు ఇజ్రాయెల్‌తో సంబంధం ఉందని, రసాయనాలు, దానికి సంబంధిత ఉత్పత్తులతో కూడిన ట్యాంకర్లను తీసుకెళ్తోందని మారిటైమ్ సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే పేర్కొంది. మరోవైపు ఎంవీ కెమ్ ప్లూటో ఇజ్రాయెల్ వ్యాపారవేత్త ఇడన్ ఓఫర్‌కు చెందినదని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కానీ, ఇప్పటి వరకు నౌకపై దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
గుజరాత్‌లోని వెరావల్ తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై శనివారం ఈ దాడి జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ వెంటనే ఐసీజీఎస్ విక్రమ్ పీ-81 రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదం నుంచి నౌకలో ఉన్న 25 మంది సిబ్బంది సురక్షింతగా బయటపడ్డారు. ఈ ఘటనపై భారత్ నావిళ దళం దర్యాప్తు ప్రారంభించింది.
-
#WATCH | Indian Coast Guard ship ICGS Vikram escorting merchant vessel MV Chem Pluto in the Arabian Sea towards Mumbai in the morning today. The merchant ship hit by a drone yesterday had requested to be escorted by the ICGS Vikram. ICG Dorniers are also airborne to keep an eye… pic.twitter.com/6FIqcayHj4
— ANI (@ANI) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Indian Coast Guard ship ICGS Vikram escorting merchant vessel MV Chem Pluto in the Arabian Sea towards Mumbai in the morning today. The merchant ship hit by a drone yesterday had requested to be escorted by the ICGS Vikram. ICG Dorniers are also airborne to keep an eye… pic.twitter.com/6FIqcayHj4
— ANI (@ANI) December 24, 2023#WATCH | Indian Coast Guard ship ICGS Vikram escorting merchant vessel MV Chem Pluto in the Arabian Sea towards Mumbai in the morning today. The merchant ship hit by a drone yesterday had requested to be escorted by the ICGS Vikram. ICG Dorniers are also airborne to keep an eye… pic.twitter.com/6FIqcayHj4
— ANI (@ANI) December 24, 2023
మరో రెండు వాణిజ్య నౌకలపైన దాడి
మరోవైపు ఎర్ర సముద్రంలో మరో రెండు వాణిజ్య నౌకలపై కూడా డ్రోన్ దాడి జరిగింది. అందులో గాబన్ జెండాతో వస్తోన్న నౌక ఒకటి ఉంది. ఎంవీ సాయిబాబా పేరిట భారత్‌లోనూ ఈ నౌక రిజిస్టర్ అయింది. అయితే, ఇది భారత జెండాతో వస్తున్నట్లు మొదట అమెరికా సైన్యం పొరపడి ప్రకటన చేసింది. యెమెన్‌లోని హౌతీ రెబెల్స్ నియంత్రణలోని భూభాగం నుంచి వచ్చిన డ్రోన్‌లే ఈ దాడికి కారణమని తెలిపింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది.
-
Houthi attack: Navy denies US claim, says MV SAIBABA tank not India-flagged; adds all 25 Indian crew members safe
— ANI Digital (@ani_digital) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/4am3snHO54#HouthiAttack #IndianNavy #MVSAIBABA #RedSea pic.twitter.com/zPiAoZ6LT0
">Houthi attack: Navy denies US claim, says MV SAIBABA tank not India-flagged; adds all 25 Indian crew members safe
— ANI Digital (@ani_digital) December 24, 2023
Read @ANI Story | https://t.co/4am3snHO54#HouthiAttack #IndianNavy #MVSAIBABA #RedSea pic.twitter.com/zPiAoZ6LT0Houthi attack: Navy denies US claim, says MV SAIBABA tank not India-flagged; adds all 25 Indian crew members safe
— ANI Digital (@ani_digital) December 24, 2023
Read @ANI Story | https://t.co/4am3snHO54#HouthiAttack #IndianNavy #MVSAIBABA #RedSea pic.twitter.com/zPiAoZ6LT0
నార్వే జెండాతో ఉన్న ఎంవీ బ్లామనెన్‌పై కూడా హౌతీలు దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. అలాగే అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్ లబూన్ పై కూడా కొన్ని డ్రోన్లు దాడికి యత్నించాయి. కానీ వాటిని ఆ యుద్ధనౌక కూల్చివేసింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్‌కామ్ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరినట్లు పేర్కొంది.
ముడి చమురు నౌకపై డ్రోన్ దాడి! షిప్లో 20 మంది ప్రయాణికులు- రంగంలోకి కోస్ట్‌గార్డ్
ఎర్ర సముద్రంలో నౌక హైజాక్ వీడియో రిలీజ్- నేరుగా హౌతీలతో మాట్లాడుతున్న జపాన్