ETV Bharat / international

'అణు యుద్ధాన్ని మోదీ ఆపారు.. పెను విధ్వంసాన్ని తప్పించారు!'.. CIA చీఫ్ కీలక వ్యాఖ్యలు - అణ్వాయుధాల ఉపయోగంపై మోదీ

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రష్యన్లపై ప్రభావం చూపాయని అమెరికా సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ పేర్కొన్నారు. ఇంకేమన్నారంటే..?

PM Modis concern on nuclear war
PM Modi
author img

By

Published : Dec 18, 2022, 4:24 PM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ అణు యుద్ధాన్ని నివారించి.. పెను విధ్వంసాన్ని తప్పించారని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ బిల్ బర్న్స్​ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. అణ్వాయుధాల వినియోగంపై మోదీ ఆలోచనలు రష్యాపై ప్రభావం చూపాయని అన్నారు. ఫలితంగా, ఉక్రెయిన్ యుద్ధంలో పెను విధ్వంసం తప్పిందని చెప్పుకొచ్చారు.

"చైనా ప్రధాని షీ జిన్‌పింగ్​తో పాటు ప్రధాని మోదీ సైతం అణ్వాయుధాల వినియోగం గురించి తమ ఆందోళనలను లేవనెత్తారు. ఈ విషయం రష్యన్‌లపై ప్రభావం చూపింది. అణ్వాయుధాల ఉపయోగంపై రష్యా ఉద్రిక్తతలు కేవలం రెచ్చగొట్టడానికి మాత్రమే. అణ్వాయుధాలు వాడటానికి రష్యా సన్నద్ధమవుతున్నట్లు ఆధారాలేవీ లేవు" అని బిల్ బర్న్స్ పేర్కొన్నారు.

కాగా, రష్యా -ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్​ శాంతి కోసం పిలుపునిస్తోంది. దౌత్యమార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతోంది. సెప్టెంబర్​లో ఎస్​సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్​ ఎదురుగానే.. 'ఈ యుగం యుద్ధాలది కాదు' అని మోదీ స్పష్టంగా చెప్పారు. డిసెంబరు 16న మరోసారి పుతిన్​తో ఫోన్​లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. యద్ధాన్ని ఆపాలంటే దౌత్యమే ఏకైక మార్గం అని మరోసారి స్పష్టం చేశారు. అంతకుముందు, అక్టోబర్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీతో మోదీ మాట్లాడారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.