ETV Bharat / international

చైనాలో ఒక్కరోజే 13 వేల కేసులు.. మాస్కుతోనే కొత్త వేరియంట్​ కట్టడి! - కొత్త కొవిడ్​ వేరియంట్​

China Corona Cases: చైనాలో కొవిడ్​ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13 వేల కేసులు నమోదయ్యాయి. కఠినమైన లాక్​డౌన్​ ఆంక్షలు విధిస్తున్నా.. వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో మహమ్మారిని కట్టడి చేయలేక చైనా అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు, కొత్త ఒమిక్రాన్​ వేరియంట్​ (ఎక్స్​ఈ) తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని, మాస్కులు తప్పనిసరిగా వాడేల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

new varaint
china covid cases
author img

By

Published : Apr 4, 2022, 7:01 AM IST

China Corona Cases: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో చైనా అల్లాడిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13వేల కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులుగా చైనా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే కోట్ల మందిపై లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో వేల సంఖ్యలో కేసులు బయటపడడం చైనా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో కొత్తగా కరోనా ఉపరకం వెలుగు చూడడం చైనా అధికారులను కలవరపెడుతోంది.

ఒక్కరోజు 13,146 కేసులు.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్న వేళ.. చైనాలో మాత్రం కొవిడ్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం నాడు దేశవ్యాప్తంగా 12వేల కేసులు నమోదుకాగా ఆదివారం ఒక్కరోజు 13,146 బయటపడ్డాయి. వీటిలో 70శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. అయితే, నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించలేదని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. ఇలా నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ కేసులు బయటపడుతుండడంతో చైనా అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్‌లోనూ లాక్‌డౌన్‌ విధించారు. హైనన్‌ ప్రావిన్సులోని సాన్యా నగరానికి వాహన రాకపోకలపై నిషేధం విధించారు. ఇప్పటికే రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.

ఉపరకం కలవరం.. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వణికిపోతోన్న చైనాలో తాజాగా ఒమిక్రాన్‌ ఉపరకం వెలుగు చూసినట్లు అక్కడి ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. షాంఘైకి సమీపంలోని కొవిడ్‌ బాధితుడిలో ఈ కొత్తరకాన్ని గుర్తించిన అధికారులు.. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన బీఏ.1.1 నుంచి పరివర్తన చెందినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో కొవిడ్‌కు కారణమైన రకంతో ఇది సరిపోలడం లేదన్నారు. ఉత్తర చైనాలోని డాలియన్‌ నగరంలో నమోదైన కేసు స్థానిక వైరస్‌తో సరిపోలడం లేదని అక్కడి మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు.

మరింత వేగంతో ఎక్స్‌ఈ.. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలను రెండేళ్లకాలంగా గడగడలాడిస్తోంది కరోనా వైరస్‌. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేరింయంట్‌ తీవ్రంగా వ్యాప్తిచెంది అనేకమంది ప్రాణాలను బలితీసుకుంది. ఇదిలా ఉంటే మరింత వేగంగా వ్యాప్తిచెందే మరో మ్యుటేషన్‌ ఇప్పుడు గుబులు రేపుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉపరకాలైన 'బీఏ.1, బీఏ.2'ల మిశ్రమ ఉత్పరివర్తనాలైన XE (ఎక్స్‌ఈ) వేరియంట్‌ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నట్లు తెలుస్తోంది. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే BA.2 కంటే.. ఇది 10శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధరణ అయ్యింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా భారత్‌లోని నిపుణులు దీనిపై స్పందిస్తూ.. మాస్కులపై అశ్రద్ధ వహించకూడదని హెచ్చరిస్తున్నారు. మాస్కులు తీసే సమయం ఇంకా రాలేదని పునరుద్ఘాటిస్తున్నారు.

ఇదీ చదవండి: వారం రోజులుగా కఠినమైన లాక్​డౌన్.. అయినా పెరుగుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.