ETV Bharat / international

చైనాపై మళ్లీ కొవిడ్‌ పంజా.. వారానికి 6.5 కోట్ల కేసులు!.. అధికారులు హైఅలర్ట్ - భారత్​ కరోనే కేసులు

చైనాలో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. XBB వేరియంట్‌కు చెందిన కేసులు ఈ నెలాఖరు కల్లా వారానికి 4 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని శ్వాసకోస స్పెషలిస్ట్ ఝోంగ్‌ నాన్‌షన్‌ అంచనా వేశారు. జూన్ కల్లా వారానికి 6 కోట్ల 50 లక్షలు నమోదు కావచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి చైనా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు

China Corona Cases
China Corona Cases
author img

By

Published : May 22, 2023, 10:47 PM IST

China Corona Cases : చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. XBB వేరియంట్‌ విజృంభణతో ఈ నెలాఖరు కల్లా వారానికి 4 కోట్ల కరోనా కేసులు నమోదు కావచ్చని శ్వాసకోస స్పెషలిస్ట్ ఝోంగ్‌ నాన్‌షన్‌ అంచనా వేశారు. జూన్‌ నెలాఖరు కల్లా వారానికి 6.5 కోట్ల చొప్పున కొత్త కేసులు నమోదు కావచ్చని ఆయన పేర్కొన్నారు. గ్వాంగ్‌ఝౌలో జరిగిన బయోటెక్‌ కాన్ఫరెన్స్‌లో ఝోంగ్‌ నాన్‌షన్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ఈ అంచనాలను వెల్లడించారు. ఏప్రిల్‌ నెలాఖరు నుంచే రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోందని బ్లూమ్ బర్గ్ వార్తా సంస్థ పేర్కొంది. జీరో కొవిడ్ నిబంధనలను సడలించిన ఆరు నెలల తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల చైనా ప్రభుత్వ సంస్థ సెంటర్‌ ఫర్‌ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ రోజు వారీ గణాంకాలను విడుదల చేయడం లేదని ఆంగ్ల మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ చర్యతో కరోనా కేసుల్లో వాస్తవికతపై ప్రశ్నలు మెుదలయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం దేశ ప్రజలందరికీ బూస్టర్‌ డోస్ ఇచ్చేందుకు చైనా ఆరోగ్య శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. గత వేవ్‌లలో జరిగినంత నష్టం ఈ వేవ్‌లో జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చైనా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది.

కరోనా పుట్టింది అక్కడే.. మూడేళ్ల తర్వాత వెల్లడించిన చైనా
కరోనా వైరస్​.. ఇది చైనాలోని హువాన్‌ చేపల మార్కెట్‌ నుంచి వ్యాప్తి చెందిందని అంటుంటే.. మరోవైపు దీన్ని వూహాన్‌ ల్యాబ్‌లో చైనా ఈ వైరస్‌ను తయారు చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇక ఈ విషయంపై చైనా శాస్తవేత్తలు ఇటీవలే అధ్యయనం చేశారు. అందులో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

కరోనా వైరస్‌ ప్రారంభమైన తొలినాళ్లలో హువాన్‌ చేపల మార్కెట్‌ నుంచి సేకరించిన నమూనాలను అధ్యయనం చేసి మూడేళ్ల తర్వాత వాటి వివరాలను తాజాగా చైనా వెల్లడించింది. నమూనాలను పరీక్షించినప్పుడు అందులో అడవి జంతువుల జన్యుపదార్థాలు కూడా ఉన్నాయని పేర్కొంది. దీనిని బట్టి కరోనా వైరస్‌ ప్రథమంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 2022 ఫిబ్రవరిలో చైనా శాస్త్రవేత్తలు తమ పరిశోధనకు సంబంధించిన ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. కానీ, హువాన్‌ మార్కెట్‌ నుంచి సేకరించిన నమూనాల జన్యు విశ్లేషణను అందులో పొందుపరచలేదు. తాజాగా ఆయా రంగాల్లో నిష్ణాతులతో సంప్రదింపులు జరిపి, వారి సమక్షంలో పరిశోధనలు చేసి అధ్యయనం వివరాలను ప్రచురించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.