ETV Bharat / international

కీలక నేతలకు ఉద్వాసన.. ఆదివారమే జిన్​పింగ్​కు పట్టాభిషేకం - షీజిన్​పింగ్​ వార్తలు

చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభలు శనివారం ముగిశాయి. ఆ దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి షీ జిన్​పింగ్​కు పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం స్టాండింగ్​ కమిటీ.. ఆయన పేరును అధికారికంగా ప్రకటించనుంది. మరోవైపు, ఇదివరకు స్టాండింగ్​ కమిటీలో ఉన్న చైనా ప్రీమియర్​​ లీ కెకియాంగ్​తో పాటు మరో ముగ్గురు నేతలకు జిన్​పింగ్​ ఉద్వాసన పలికారు.

china jinping
china jinping
author img

By

Published : Oct 22, 2022, 12:36 PM IST

మావో జెడాంగ్‌ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను ప్రతిష్ఠించడమే ప్రధాన అజెండాగా సాగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభలు శనివారంతో ముగిశాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు.. గత ఆదివారం రాజధాని బీజింగ్​లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్​లో ప్రారంభమయ్యాయి. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 2,300 మంది హాజరైన ఈ సమావేశాల్లో.. 370 మంది సభ్యులతో కూడిన సెంట్రల్​ కమిటీని ఎన్నుకున్నారు.

అయితే ఈ సెంట్రల్​ కమిటీ.. ఆదివారం మరోసారి సమావేశమై 25 మంది నాయకులతో పొలిటికల్​ బ్యూరోను ఎన్నుకోనుంది. అనంతరం ఈ పొలిటికల్ బ్యూరో.. ఏడుగురు సభ్యులతో కూడిన స్టాండింగ్​ కమిటీని ఎన్నుకోనుంది. ఆ తర్వాత శక్తిమంతమైన స్టాండింగ్​ కమిటీ.. జనరల్​ సెక్రటరీ( పార్టీ అధ్యక్షుడు) పేరును ప్రకటించనుంది. ఇప్పటికే జిన్​పింగ్​కు మూడోసారి పగ్గాలు అప్పగించేందుకు సెంట్రల్​ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు.

పార్టీతో పాటు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించిన జిన్​పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన జిన్ పింగ్, ఒక వ్యక్తి రెండుసార్లు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

ఐసోలేషన్​లో జర్నలిస్టులు..
కొత్త ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత.. స్టాండింగ్ కమిటీ సభ్యులతో పాటు జిన్ ​పింగ్​ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కాగా, మీడియా సమవేశానికి హాజరయ్యే జర్నలిస్టులు.. ఇప్పటికే బీజింగ్​లో నాలుగు రోజులుగా ఐసోలేషన్​లో ఉన్నారు.

కీలక నేతలకు ఉద్వాసన..
కొన్నేళ్లుగా స్టాండింగ్​ కమిటీలో ఉన్న నలుగురు కీలక నేతలకు జిన్​ పింగ్​ ఉద్వాసన పలికారు. చైనా ప్రీమియర్​ లీ కెకియాంగ్​తో పాటు మరో ముగ్గురు నేతల పేర్లను.. ఈసారి స్టాండింగ్​ కమిటీ జాబితాలో చేర్చలేదని అక్కడ మీడియా వర్గాలు తెలిపాయి.

మరోవైపు, ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు హు జింటావోను భద్రతా బలగాలు బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లాయి. హాలులో జిన్​పింగ్ పక్కన కూర్చున్న జింటావో.. బయటకు వెళ్లేందుకు ఒప్పుకోనప్పటికీ.. గార్డులు బలవంతంగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వెళ్లే సమయంలో జిన్​పింగ్​తో ఏదో చెబుతున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. అయితే దీనిపై చైనా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 2012 వరకు పదేళ్ల పాటు చైనా అధ్యక్షుడిగా ఉన్న జింటావో.. అనంతరం జిన్​పింగ్​కు బాధ్యతలు అప్పజెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.