Boat Capsized In Congo : కాంగోలోని ఈక్వెటూర్ ప్రావిన్స్‌లోని పడవ బోల్తా పడ్డ ఘటనలో 28 మంది మరణించారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ప్రావిన్స్ రాజధాని బండకా నుంచి సుమారు 74 మైళ్ల దూరంలో ఉన్న న్గోండోకు ప్రయాణిస్తుండగా పడవ బోల్తా పడినట్లు చెప్పారు. దాదాపు 200 మంది ప్రయాణికులను రక్షించామని, మరికొంత మంది తప్పిపోయారని ఆయన చెప్పారు. ఈక్వెటూర్ ప్రావిన్స్‌లోని కాంగో నదిలో వారం వ్యవధిలో పడవ ప్రమాదం జరగడం ఇది రెండోసారి. అక్టోబర్ 14న మరో పడవ బోల్తా పడి 47 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రమాదాలను నివారించడానికి కాంగో ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాత్రిపూట నదీ ప్రయాణాన్ని నిషేధించింది. కానీ చాలామంది ఆదేశాన్ని ధిక్కరించి ప్రయాణిస్తున్నారు.
Nigeria Boat Accident : ఈ ఏడాది జూన్‌లో నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఓ పడవ క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిపై బోల్తా పడిన ఘటనలో 100 మంది మరణించగా.. అనేక మంది గల్లంతు అయ్యారు. బాధితులు పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగిందీ దుర్ఘటన. పడవలో మహిళలతో పాటు పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితులు.. నైజర్ రాష్ట్రంలోని ఎగ్బోటి గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. అనంతరం తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లే క్రమంలో నైజర్ నదిలో బోటు బోల్తా పడిందని తెలిపారు. పడవ ప్రమాద సమయంలో పడవలో వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారని చెప్పారు.
Migrants Boat Capsized : ఈ ఏడాది ఆగస్టులో వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మునిగి ఏడుగురు చనిపోగా 56 మందికి పైగా గల్లంతయ్యారు. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కి.మీ దూరంలో ఉన్న కేప్ వర్డె దీవుల్లో జరిగిన ఈ ఘటనలో 38 మంది ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈ విషయాన్ని యూఎన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఫర్ ఆర్గనైజేషన్ సంస్థ తెలిపింది.
సముద్రంలో మూడు పడవలు మాయం.. 300 మంది వలసదారులు మిస్సింగ్!
పడవ బోల్తా పడి 30 మంది మృతి.. విద్యుత్ తీగలకు హెలికాప్టర్ తగిలి మరో ఆరుగురు..