ETV Bharat / international

అంధురాలిలా 15 ఏళ్లు యాక్టింగ్.. ప్రభుత్వానికి రూ.2కోట్లు టోకరా.. సెల్​ఫోన్ స్క్రోల్​ చేస్తూ సిల్లీగా దొరికిపోయి.. - ఇటలీ అంధురాలిగా నటిస్తూ ఫించన్​ తీసుకున్న మహిళ

ఓ మహిళ తనను తాను అంధురాలిగా ప్రకటించుకుంది. సమాజాన్ని, అధికారులను నమ్మించి 15 ఏళ్లుగా ప్రభుత్వం నుంచి పింఛన్​ తీసుకుంది. ఇంత కాలంగా ఎవరికీ దొరకలేదు. అనుమానం రానివ్వలేదు. కానీ, ఆమె చేసిన ఓ పొరపాటు వల్ల కటకటాలపాలైంది. ఇంతకీ ఆ మహిళ ఎలా పట్టుబడిందంటే..

Woman pretended to be blind for 15 years

author img

By

Published : Mar 31, 2023, 1:55 PM IST

'నిద్ర పోయేవాణ్ని లేపచ్చు.. కానీ నిద్ర నటించే వాడిని లేపడం చాలా కష్టం' అని అంటుంటారు. అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ అంధురాలిగా నటిస్తూ.. దాదాపు 15 ఏళ్లుగా దివ్యాంగుల కేటగిరీలో ప్రభుత్వం నుంచి పింఛన్​ తీసుకుంటోంది. 15 సంవత్సరాలు ఆమెను ఎవరూ పట్టుకోలేదు. తనకు తానుగా ఎవరికీ దొరలేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు నటించేవాళ్లు అంత సులభంగా దొరకరు కదా. కానీ, ఈ మహిళ చివరకు తన పొరపాటు వల్లే.. అధికారులకు చిక్కి కటకటాలపాలైంది. ఇంతకీ ఆ మహిళ ఎలా దొరికిందంటే!

ఇటలీకి చెందిన 48 ఏళ్ల వయుసున్న ఓ​ మహిళ.. తనను తాను ఓ అంధురాలిగా ప్రకటించుకుంది. వైద్యులు, ప్రభుత్వ అధికారులను నమ్మించి.. ఎలాగోలా అంధురాలిననే ధ్రువీకరణ పత్రం పొందింది. ఇంకేముంది.. ప్రజల్లో అంధురాలు అనే జాలి కలిగేలా చేసుకుంది. దాంతో పాటు.. ఇటలీ ప్రభుత్వ నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ సోషల్​ సెక్యూరిటీ సంస్థ నుంచి పింఛన్​ వచ్చేలా చేసుకుంది. అలా.. 15 సంవత్సరాలు ద్విపాత్రాభినయం చేస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా కాలం వెళ్లదీసింది. అలా 15 ఏళ్లలో ప్రభుత్వం నుంచి 2,08,000 యూరోలు.. (భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లు) పింఛన్ రూపంలో కొల్లగొట్టింది.

అలవాటులో పొరపాటు అనే మాట మనం వినే ఉంటాం. ఆ పొరపాటే ఈ 'మహానటి' అధికారులకు చిక్కేలా చేసింది. ఎవరూ తనను చూడడం లేదు అనుకుందో లేక హఠాత్తుగా ఏ కష్టం ఊడిపడిందో తెలియదు గానీ.. ఓ రోజు సెల్​ ఫోన్​ తీసుకుని స్క్రోల్​ చేయడం మొదలుపెట్టింది. ఫైళ్లపై అలవోకగా సంతకాలు చేసింది. అయితే, ఆమెపై అనుమానంతో ఎప్పటి నుంచే రెక్కీ చేస్తున్నారు అధికారులు. అంధురాలిగా నటిస్తున్న మహిళ.. సెల్​ ఫోన్​ స్క్రోల్​ చేయడం, ఫైళ్లపై సంతకం చేయడం చూసిన కారబినీరి (ఇటలీ దర్యాప్తు సంస్థ(Carabinieri)) అధికారులు.. ఆమెను పట్టుకున్నారు. ఆ మహిళ అంధురాలైతే ఇలాంటి పనులు అవలీలగా చేయడం సాధ్యం కాదనేది వారి వాదన.

తాను అంధురాలినంటూ దేశానికి వ్యతిరేకంగా తీవ్రమైన, నిరంతరం మోసానికి పాల్పడిందని అధికారులు ఆరోపించారు. ఆమె అంధత్వాన్ని.. వేర వేరు సందర్భాల్లో ద్రువీకరించిన ఇద్దరు వైద్యులను కూడా విచారిస్తామని వెల్లడించారు. చట్టబద్ధంగా విధులు పాటించకుండా.. తప్పుడు పత్రాలతో అధికారులు దేశాన్ని మోసం చేయడం లాంటి ఆరోపణలకు వారు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.