ETV Bharat / international

48 ఏళ్ల క్రితం నాటి బిల్​గేట్స్ రెజ్యూమ్​ వైరల్​ - బిల్‌గేట్స్‌ బిజినెస్‌మ్యాన్‌

bill gates resume: వ్యాపారవేత్త, అపర కుబేరుడు బిల్​గేట్స్ 48 ఏళ్ల క్రితం తాను తయారు చేసుకున్న రెజ్యూమ్​ను లింక్‌డ్‌ఇన్‌లో షేర్​ చేశారు. బిల్‌గేట్స్‌ ఈ రెజ్యూమ్‌ను పంచుకుంటూ దీనికి మరిన్ని మెరుగులు దిద్దితే బాగుండేదని కూడా అభిప్రాయపడ్డారు. అయితే నెటిజన్లు మాత్రం గేట్స్ రెజ్యూమ్ పర్‌ఫెక్ట్‌ ఉందని అంటున్నారు. ​

bill gates resume
బిల్‌గేట్స్‌
author img

By

Published : Jul 2, 2022, 7:24 AM IST

bill gates resume: అమెరికా కుబేరుడు, బిజినెస్‌మ్యాన్‌ బిల్‌గేట్స్‌ ఓ అరుదైన విషయాన్ని లింక్‌డ్‌ఇన్‌ వేదికగా పంచుకున్నారు. 48 ఏళ్ల క్రితం తాను తయారు చేసుకున్న రెజ్యూమ్‌ను షేర్‌ చేశారు. రెజ్యూమ్‌ను లింక్‌డ్‌ఇన్‌లో పోస్టు చేస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు. 'మీరు ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులైనా, లేదా కాలేజీ చదువుల్ని మధ్యలోనే మానేసినవారైనా కానీ మీ రెజ్యూమ్‌ 48 ఏళ్ల క్రితం నాటి నా రెజ్యూమ్‌ కంటే కచ్చితంగా బెటర్‌గా ఉంటుందని భావిస్తున్నా'నంటూ పోస్టు చేశారు. కాగా ప్రస్తుతం ఆయన పోస్టు వైరల్‌గా మారింది.

bill gates resume
48 ఏళ్ల క్రితం నాటి బిల్​గేట్స్ రెజ్యూమ్

బిల్‌గేట్స్‌ హార్వర్డ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఈ రెజ్యూమ్‌ను తయారు చేసుకున్నారు. ఇందులో తన పని అనుభవం సహా.. షాడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ నిర్మాణం, కంప్యూటర్ గ్రాఫిక్స్‌ లాంటి నైపుణ్యాలను రాసుకొచ్చారు. వీటితోపాటు ప్రోగ్రామింగ్ భాషల్లో తన ప్రావీణ్యాలను వెల్లడించారు. 1973లో సిస్టమ్స్ గ్రూప్, 1972లో సీటెల్‌లోని లకాసైడ్ స్కూల్లో కాంట్రాక్ట్‌పై సహ నాయకుడిగా, సహ భాగస్వామిగా పనిచేసినట్లు రాసుకొచ్చారు.

బిల్‌గేట్స్‌ ఈ రెజ్యూమ్‌ను పంచుకుంటూ దీనికి మరిన్ని మెరుగులు దిద్దితే బాగుండేదని కూడా అభిప్రాయపడ్డారు. అయితే నెటిజన్లు మాత్రం గేట్స్ రెజ్యూమ్ పర్‌ఫెక్ట్‌ ఉందని పేర్కొంటున్నారు. నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకు నాటి అంశాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇవీ చదవండి: పుతిన్​కు మోదీ ఫోన్​! ఆ​ అంశంపైనే సుదీర్ఘ చర్చ

ఆ దేశ పార్లమెంట్‌ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.