Biden On Pakisthan: పాకిస్థాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాకిస్థాన్ ఒకటని ఆరోపించారు. ప్రపంచ దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండానే పాక్ అణ్వాయుధాలను కలిగి ఉందని మండిపడ్డారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ సమావేశంలో అగ్రరాజ్య అధినేత ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనా, రష్యాలపై కూడా బైడెన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
చైనా, రష్యాలతో అమెరికా విదేశాంగ విధానాలపై మాట్లాడిన బైడెన్.. పాకిస్థాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తున్న వేళ.. బైడెన్ వ్యాఖ్యలు షెహబాజ్ షరీఫ్ సర్కారుకు ఎదురుదెబ్బగా మారాయి. అమెరికా జాతీయ భద్రతా వ్యూహాలకు సంబంధించి విధానాలు విడుదలైన రెండ్రోజుల తర్వాత బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 48 పేజీలతో విడుదల చేసిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహాల్లో పాకిస్థాన్‌కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి: పార్లమెంట్లో సుత్తితో మొబైల్ పగలగొట్టిన ఎంపీ.. ఎందుకంటే?
ఫుడ్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన బైడెన్.. 50 శాతం డిస్కౌంట్.. తర్వాత ఏం జరిగింది?