ETV Bharat / international

Biden On Russia : 'హమాస్​, రష్యా రెండూ ఒకటే'.. పుతిన్​పై బైడెన్​ కీలక వ్యాఖ్యలు - us on russia ukraine war

Biden On Russia : తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్‌కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఆ దేశాలకు అండగా ఉండటం అమెరికా ప్రయోజనాలకు అత్యంత కీలకమని చెప్పారు.

Biden On Russia
Biden On Russia
author img

By PTI

Published : Oct 20, 2023, 10:49 AM IST

Updated : Oct 20, 2023, 11:29 AM IST

Biden On Russia : హమాస్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌, ఉక్రెయిన్‌కు ఎప్పుడూ అండగా ఉంటామని బైడెన్‌ పునరుద్ఘాటించారు. హమాస్, రష్యా ఒకటేనని అన్న బైడెన్.. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని ఇవి చూస్తున్నాయని ఆరోపించారు. హమాస్‌, రష్యా వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఒక విషయంలో ఆ రెండింటి ఎజెండా ఒకటే అన్నారు. ప్రపంచ పెద్దగా విచ్ఛినకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోమన్న అగ్రరాజ్య అధినేత.. హమాస్, పుతిన్ వంటి ఉగ్రవాద సంబంధ శక్తులను గెలవనీయబోమని స్పష్టం చేశారు. అమెరికా విలువలు ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా ఉంటాయన్నారు. గురువారం రాత్రి ఓవల్‌ ఆఫీసు నుంచి దేశ ప్రజలనుద్దేశిస్తూ ఆయన కీలక ప్రసంగం చేశారు.

  • #WATCH | US President Joe Biden says "...In recent years, too much hate has given too much oxygen fueling racism, the rise of antisemitism and Islamic phobia right here in America...I know many of you in the Muslim American community, the Arab American community, the Palestinian… pic.twitter.com/Q3RCWxwokJ

    — ANI (@ANI) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఓ గొప్ప దేశంగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలకు చిన్నపాటి రాజకీయ విభేదాలు అడ్డు కాకూడదు. హమాస్‌ లాంటి ఉగ్రవాదులు, పుతిన్‌ లాంటి నియంతలను మనం గెలవనివ్వకూడదు. హమాస్‌, పుతిన్‌ పాల్పడే బెదిరింపులు భిన్నమైనవి కావొచ్చు. కానీ వారి ఎజెండా మాత్రం ఒకటే. పొరుగు ప్రజాస్వామ్యాలను పూర్తిగా నాశనం చేయాలనే వారు కోరుకుంటున్నారు. ఇలాంటి దురాక్రమణలు కొనసాగేందుకు మనం అనుమతిస్తే.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఆ ఘర్షణలు వ్యాపిస్తాయి. అమెరికా నాయకత్వం ప్రపంచాన్ని ఏకతాటిపై నిలిపింది. మిత్రదేశాల వల్లే అమెరికా సురక్షితంగా ఉంటుంది. మన విలువలు, విధానాల వల్లే భాగస్వాములు మనతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం ఉక్రెయిన్‌కు సాయం చేయకుండా దూరంగా జరిగితే.. ఇజ్రాయెల్‌కు వెన్నుపోటు పొడిస్తే.. వాటన్నింటినీ ప్రమాదంలో పడేసినట్లే. అది సరైంది కాదు"

--జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు

US Aid To Israel : ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌, తైవాన్‌ వంటి దేశాలకు మానవతా సాయం, ఆర్థిక సహకారం, సరిహద్దుల నిర్వహణ కోసం 100 బిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ ప్యాకేజీ ప్రకటించనున్నట్లు బైడెన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ భారీ విరాళాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరారు. ఈ యుద్ధాల్లో ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌ గెలిచేలా మనం అండగా ఉండటం అమెరికా ప్రయోజనాలకు అత్యంత కీలకమన్నారు. ఈ చిన్న సాయం.. తర్వాతి తరాల అమెరికన్ల భద్రతకు మూలమవుతుందని.. అమెరికాను ప్రపంచ లీడర్‌గా నిలబెడుతుందని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

హమాస్‌తో పోరు నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించేందుకు బైడెన్‌ ఇటీవల ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటన నుంచి వచ్చిన మరుసటి రోజే ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగానికి ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ మాట్లాడినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. ఇక, ఓవల్‌ ఆఫీసు నుంచి బైడెన్‌ ప్రసంగించడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. గతంలో అమెరికాను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కాంగ్రెస్‌ బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత ఓవల్‌ ఆఫీస్​ నుంచి ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

US Aid To Gaza : గాజాకు అమెరికా రూ.832కోట్ల సాయం.. 10లక్షల మంది ప్రజలకు అండగా..

US Sanctions On Hamas : హమాస్​పై అమెరికా కన్నెర్ర.. 10మంది సభ్యులపై ఆంక్షలు.. ఇక ఆ నిధులు బంద్​!

Last Updated : Oct 20, 2023, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.