ETV Bharat / international

తప్పిన పెను ప్రమాదం.. ఆకాశంలో అతి దగ్గరగా రెండు విమానాలు.. క్షణాల్లో లక్కీగా.. - నేపాల్ ఎయిర్​లైన్స్ ప్రమాదం

నేపాల్​ గగనతలంలో పెనుప్రమాదం తప్పింది. రెండు విమానాలు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఎయిర్​ఇండియా, నేపాల్ ఎయిర్​లైన్స్​కు చెందిన విమానాలు ఆకాశంలో ఉండగా.. ఒకదానికొకటి చాలా దగ్గరకు వచ్చాయి. వార్నింగ్​ సిస్టమ్స్ పైలెట్లను​ హెచ్చరించడం వల్ల రెండు విమానాలు ఢీకొనకుండా తప్పించుకున్నాయి. ఈ ఘటన శుక్రవారం జరిగిందని నేపాల్​ పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపారు.

air india latest news
air india latest news
author img

By

Published : Mar 26, 2023, 5:25 PM IST

Updated : Mar 26, 2023, 6:15 PM IST

నేపాల్​లో రెండు విమానాలు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఎయిర్​ఇండియా, నేపాల్ ఎయిర్​లైన్స్​కు చెందిన విమానాలు గాల్లో ఉండగా పరస్పరం అతి దగ్గరగా వచ్చాయి. వార్నింగ్​ సిస్టమ్స్ పైలెట్లను​ హెచ్చరించడం వల్ల రెండు విమానాలు ఢీకొనకుండా తప్పించుకున్నాయి. ఈ ఘటన శుక్రవారం జరిగిందని నేపాల్​ పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపారు. అజాగ్రత్తగా వ్యవహరించిన ముగ్గురు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​ అధికారులను సస్పెండ్​ చేస్తన్నట్లు ప్రకటించారు. దీనిపై ఎయిర్​ఇండియా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఎయిర్​బస్​ A-320 విమానం కాఠ్​మాండూ నుంచి కౌలాలంపుర్​కు వెళ్తోంది. ఇదే సమయంలో ఎయిర్ఇండియాకు చెందిన మరో విమానం దిల్లీ నుంచి కాఠ్​మాండూకు ప్రయాణిస్తోంది. "నేపాల్​ ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. అయితే, ఎయిర్​ఇండియా విమానం 19,000 అడుగుల నుంచి కిందకు దిగుతోంది. దీనిని గమనించిన వార్నింగ్​ సిస్టమ్స్ పైలెట్స్​ను హెచ్చరించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నేపాల్​ ఎయిర్​లైన్స్​ విమానాన్ని 7,000 అడుగుల కిందకు దించారు." అని ఎయిర్​లైన్స్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహించిన నేపాల్ పౌరవిమానయాన శాఖ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దీనికోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

విమానం కుప్పకూలి 72 మంది మృతి
నేపాల్​లో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. జనవరిలో జరిగిన ఓ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 72 మంది మరణించారు. నేపాల్ పౌర విమానయాన అథారిటీ (సీఏఏఎన్) ప్రకారం.. యెటి ఎయిర్​లైన్స్​కు చెందిన 9ఎన్-ఏఎన్​సీ ఏటీఆర్-72 అనే విమానం.. పొఖారాలోని విమానాశ్రయానికి సమీపంలోని సేతి నది ఒడ్డున ఈ విమానం అదుపుతప్పి కుప్పకూలింది.

వేగంగా మారిపోయే వాతావరణం..
నేపాల్‌ పర్వత ప్రాంతం కావడం వల్ల ఇక్కడ వాతావరణం చాలా వేగంగా మారిపోతుంది. విమానాశ్రయాలు కూడా పర్వతాలపై సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ గాలి సాంద్రత తక్కువగా ఉండడం వల్ల విమానాల ఇంజిన్ల సామర్థ్యం తగ్గిపోతుంది. అకస్మాత్తుగా వాతావరణం మారితే మార్గం కనిపించడం కష్టమైపోతుంది. దీనికి గాలి సాంద్రతలో తేడాలు కూడా జతకలిసి ప్రయాణాన్ని కఠినతరం చేస్తాయి. ఇక్కడ వాడే చాలా పాత విమానాల్లో వీటిని తట్టుకొనే అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులో లేవు. బ్రిటన్‌ వంటి దేశాలు దౌత్య కార్యాలయాలు నేపాల్‌లో ప్రయాణించే తమ దేశస్థులకు ముందస్తు సూచనలు కూడా ఇస్తుంటాయి. ఇక్కడ వాతవరణం దెబ్బకు చిన్నవిమానాలు తరచూ ప్రమాదాలు అవుతుంటాయి.

కాలం చెల్లిన టెక్నాలజీ..
ప్రపంచంలోని పేద దేశాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు దేశీయ ప్రయాణాలకు పాత విమానాలనే వినియోగిస్తాయి. అనుకోని సమస్యలు తలెత్తితే తట్టుకొనేలా అత్యాధునిక వాతావరణ రాడార్లు, జీపీఎస్‌ టెక్నాలజీ వంటివి ఇక్కడ ఉండవు. ఇప్పటికీ అక్కడ దశాబ్దాల నాటి విమానాలనే ఉపయోగిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ నేపాల్‌తో కలిసి పనిచేస్తోంది.

ఇవీ చదవండి : చిన్నారి 'మాయ' హత్య కేసులో దోషికి 100 ఏళ్లు జైలు శిక్ష

సుడిగాలుల విధ్వంసం.. కళ్ల ముందే ఇళ్లు మాయం.. 26 మంది మృతి

Last Updated : Mar 26, 2023, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.