ETV Bharat / international

65 వెడ్స్​ 16.. బాలికతో నగర మేయర్​ పెళ్లి.. వెంటనే అత్తకు కీలక పదవి - 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 65 ఏళ్ల మేయర్

బ్రెజిల్​కు చెందిన 65 ఏళ్ల నగర మేయర్​.. 16 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అనంతరం అమ్మాయి తల్లికి సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చారు. తాజాగా ఈ విషయం బయటపడడం వల్ల పెద్ద చర్చకు దారి తీసింది.

65 Year Old Mayor Marries 16 Year Old Girl

author img

By

Published : Apr 30, 2023, 4:39 PM IST

Updated : Apr 30, 2023, 5:37 PM IST

65 ఏళ్ల వయసున్న ఓ నగర మేయర్​ 16 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ వింత పెళ్లి బ్రెజిల్​లో జరిగింది. దక్షిణ బ్రెజిల్​లోని అరౌకారియా నగరానికి చెందిన హిస్సామ్​ హుస్సేన్​ దేహైని వయసు 65 ఏళ్లు. ఆయన ప్రస్తుతం అరౌకారియా మేయర్​గా కొనసాగుతున్నారు. అయితే తన కన్నా 49 ఏళ్లు చిన్నదైన ఓ 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకుని వివాదంలో చిక్కుకున్నారు దేహైని. ఆమెను పెళ్లి చేసుకున్న అనంతరం వధువు తల్లిని స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శిని చేశారు. ఈ విషయం బయటపడడం వల్ల మేయర్​.. అవినీతి, బంధుప్రీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఫలితంగా ఈ ఘటనపై విచారణ సంస్థలు దర్యాప్తును మొదలుపెట్టాయి.

బ్రెజిల్​ చట్టాల ప్రకారం 16 ఏళ్ల పైబడిన అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే.. వారి తల్లిదండ్రుల అనుమతితో చేసుకోవచ్చు. దీంతో అమ్మాయికి 16 ఏళ్లు దాటిన మరుసటి రోజే వివాహం చేసుకున్నారు దేహైని. అయితే, అమ్మాయి తల్లికి అంతకుముందే విద్యా శాఖలో ఉద్యోగం ఉంది. కానీ తక్కువ జీతం, హోదా కావడం వల్ల.. పెళ్లైన తర్వాత పర్యటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించారు దేహైని.

65 Year Old Mayor Marries 16 Year Old Girl
16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న 65 ఏళ్ల మేయర్

అయితే, ఈ నియామకం పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. సిటీ సివిల్​ రిజిస్ట్రీ హిల్దా లక్లాసీ సీమా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈమె ప్రస్తుతం నగరానికి డిప్యూటీ మేయర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. దేహైనితో కలిసే సీమా.. 2016, 2020 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ వివాదంపై స్పందించిన మేయర్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. మేయర్​.. తనకున్న విచక్షణ అధికారాల మేరకు.. నిబంధనలకు లోబడే ఆమెను కార్యదర్శిగా నియమించారని తెలిపింది. ఆమెకు ప్రజాసేవలో 26 ఏళ్ల అనుభవం ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. కానీ మేయర్​ కార్యాలయం చేసిన ప్రకటనను సీమా తోసిపుచ్చారు.

ఆయనకు 47 ఆమెకు 26.. ఎస్పీ నేత కూతురితో బీజేపీ లీడర్​ మాయం
కొద్ది రోజుల క్రితం ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 47 ఏళ్ల బీజేపీ నేత.. సమాజ్​వాదీ పార్టీకి చెందిన ఓ నాయకుడి కూతురి(26)ని తీసుకుని పారిపోయారు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగింది. రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సైతం నడిచింది. హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆశిశ్ శుక్లా అనే బీజేపీ నాయకుడు.. 26 ఏళ్ల సమాజ్​వాది పార్టీ నేత కూతురితో పారిపోయారు. ఆశిశ్ శుక్లా ప్రస్తుతం హర్దోయ్ నగర భాజపా జనరల్​ సెక్రెటరీగా ఉన్నాడు. ఆయనకు ఇదివరకే పెళ్లైంది. 21 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఏడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే సమాజ్​వాదీ పార్టీకి చెందిన నాయకుడి కూతురికి ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది. త్వరలో ఆమె పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆశిశ్ శుక్లా ఆ అమ్మాయితో పారిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి : సౌండ్ చేయొద్దన్నందుకు పక్కింటి వారిపై కాల్పులు.. చిన్నారి సహా ఐదుగురు మృతి

పాక్​లో దారుణం.. మహిళల సమాధులు తవ్వి అత్యాచారాలు.. 'యావత్​ దేశం సిగ్గుతో ఉరేసుకోవాలి!'

Last Updated : Apr 30, 2023, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.