ETV Bharat / international

మళ్లీ ప్రాణాంతక 'మెర్స్‌' వైరస్​ కలకలం.. 28 ఏళ్ల యువకుడిలో లక్షణాలు.. - మెర్స్ కోవ్ కొవిడ్ కేసులు

Mers Virus In Abu Dhabi : ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ వైరస్​ మళ్లీ కలకలం రేపింది. అబుదాబీలో 28 ఏళ్ల యువకుడిలో ఈ వైరస్‌ వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. యువకుడితో సన్నిహితంగా మెలిగిన వారిలో మాత్రం ఈ రోగ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది.

mers virus in abu dhabi
mers virus in abu dhabi
author img

By

Published : Jul 26, 2023, 6:48 AM IST

Mers Virus In Abu Dhabi : కొవిడ్‌ నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పలు దేశాల్లో మాత్రం కొవిడ్​ తరహా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ కుటుంబానికి చెందిన ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) మళ్లీ కలకలం రేపింది. అబుదాబీలో ఓ 28 ఏళ్ల యువకుడిలో మెర్స్​-కోవ్​ వైరస్‌ వెలుగు చూసింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా నిర్ధరించింది. అయితే, అతడు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షించగా.. ఎవ్వరికి మెర్స్​-కోవ్​ వైరస్‌ సోకలేదని తెలిపింది.

Mers Virus UAE : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అల్‌ ఐన్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పీసీఆర్‌ పరీక్షలు జరపగా మెర్స్‌-కోవ్‌గా నిర్ధరణ అయ్యింది. అయితే.. అతడితో పాటు సన్నిహితంగా మెలిగిన 108 మందిని పరీక్షించగా.. ఎవ్వరిలోనూ వైరస్‌ జాడలు కనిపించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో ఒంటెల వంటి జంతువుల నుంచే వైరస్​ సోకి ఉండవచ్చని అనుమానించారు. ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన ఈ వ్యక్తి ఒంటెలతో సమీపంగా మెలిగిన దాఖలాలు లేవని తెలుస్తోంది. మరోవైపు.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపైనా డబ్ల్యూహెచ్‌వో, యూఏఈ ఆరోగ్యశాఖ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.

Mers Virus Outbreak : మెర్స్​-కోవ్​ కరోనా వైరస్‌ (MERS-CoV) తొలిసారి 2012లో సౌదీ అరేబియాలో బయటపడింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ బ్రిటన్‌, అమెరికాతో సహా 27 దేశాల్లో వెలుగు చూసింది. అత్యంత ప్రాణాంతకమైన ఈ వైరస్‌ సోకిన బాధితుల్లో 35శాతం మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 2,605 కేసులు నమోదు కాగా.. 936 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలుపుతున్నాయి.

Mers Virus Symptoms : మెర్స్‌-కోవ్‌ను జూనోటిక్‌ వైరస్‌గా పరిగణిస్తారు. అంటే జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతుంటాయి. ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఒంటెల నుంచి మెర్స్​-కోవ్​ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకడం వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు మరికొన్ని సమయాల్లో నిమోనియా లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ సోకిన వ్యక్తుల్లో మరణాలు రేటు చాలా అధికంగా ఉంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.