ETV Bharat / international

పాపం.. ఆ మహిళ ఫోన్​కు వరుసగా 4,500 కాల్స్​.. చివరకు...

Woman received 4500 calls: ఓ మహిళ ఫోన్​ నంబర్​కు 4,500కు పైగా కాల్స్​ వచ్చాయి. ఏం జరుగుతుందో తెలియక ఆమె అయోమయం చెందింది. చివరకు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని అవాక్కయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

woman-flooded-with-4500-calls
మహిళ ఫోన్​ నంబర్​కు 4,500 కాల్స్​.. ఎందుకంటే?
author img

By

Published : Dec 23, 2021, 6:51 PM IST

Woman received 4500 calls: ఉత్తర ఐర్లాండ్​లో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఆమె ఫోన్ నంబర్​కు వరుసగా 4,500కు పైగా కాల్స్​ రావడం వల్ల ఉక్కిరిబిక్కిరి అయింది. చివరకు ఓ చిన్న పొరపాటు వల్ల తనకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిసి శాంతించింది.

వేల కాల్స్​ వచ్చిన ఈ మహిళ పేరు హెలెన్​ మెక్​మోహన్​. ఓ ప్రాథమిక చికిత్స శిక్షణా కేంద్రాన్ని నడుపుతోంది. ఉన్నట్టుండి ఆమె ఆఫీస్​లోని ఫోన్​కు వందల కాల్స్​ రావడం మొదలైంది. ఎవరైనా శిక్షణ కోసం ఫోన్​ చేస్తున్నారేమో అని భావించి ప్రతి కాల్​కు హెలెన్​ స్పందించింది. కానీ వారంతా వేరే విషయాలు అడుగుతున్నారు. వీళ్లంతా తనకు ఎందుకు కాల్​ చేస్తున్నారో తెలుసుకునేందుకు తను రిసీవ్​ చేసుకున్న ఓ నంబర్​కు ఆమె తిరిగి ఫోన్​ చేసింది. 'స్పెండ్ లోకల్​ స్కీమ్'​ వారు తనకు ఈ నంబర్​ ప్రకటనలో ఇచ్చారని ఆ వ్యక్తి హెలెన్​కు చెప్పారు. ఆ వివరాలు తన మెయిల్​కు పంపమని ఆమె అడిగింది. మొయిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న నంబర్​ హెలెన్​దే. స్పెండ్​ లోకల్​ స్కీమ్ వారు ఫోన్​ నంబర్​లో ఓ అంకెను తప్పుగా ప్రచురించడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఆ నంబర్​ హెలెన్​దే కావడం వల్ల ఆమెకు కుప్పకుప్పలుగా ఫోన్లు వచ్చాయి. విషయం తెలుసుకున్న స్పెండ్​ లోకల్ స్కీమ్​ వారు హెలెన్​కు క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగిందని ప్రాధేయపడ్డారు.

Northern ireland woman

"స్పెండ్ లోకల్​ స్కీమ్ పథకం ప్రారంభమైనప్పుడు నాకు వందల కాల్స్ వచ్చాయి. తీరా చూస్తే వాళ్ల ఫోన్ నంబర్​, నా ఫోన్ నంబర్​కు ఒక్క అంకె మాత్రమే తేడా. పొరపాటున వారు నా నంబర్​ ప్రచురించారు. క్రిస్​మస్ దగ్గరుపడుతుంది కాబట్టి ప్రాథమిక చికిత్స శిక్షణ కోసం వీళ్లంతా ఫోన్ చేస్తున్నారేమో అని నేను భావించా. కాల్స్​ చేసిన వారిలో ఓ మహిళ మాట్లాడిన తీరు బాగుంది. అందుకే ఆమెకే తిరిగి ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నా. మెయిల్​లో వివరాలు చూశాక గానీ దీనంతటికీ కారణమేంటో తెలియలేదు" అని హెలెన్ వివరించారు.

కరోనా​ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవాలనే ఉద్దేశంతో నార్తర్న్ ఐర్లాండ్ ప్రభుత్వం స్పెండ్ లోకల్ స్కీమ్ అనే పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన వారికి 100 యూరోలు ఖాతాల్లో వేస్తోంది. ప్రీపెయిడ్​ మాస్టర్​ కార్డు ద్వారా స్థానిక వ్యాపారాలు, దుకాణాల్లో వీటిని ఉపయోగించుకోవాలి. అయితే ఈ పథకం గడువు ముగుస్తుందని ప్రజలకు మెయిల్​ ద్వారా తెలియజేసే క్రమంలో పొరపాటున హెలెన్ ఫోన్ నంబర్​ను ప్రకటనలో ఇచ్చారు.

ఇదీ చదవండి: కరోనా చికిత్సకు తొలి ట్యాబ్లెట్- వైరస్​పై గెలుపు ఇక సులువయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.