ETV Bharat / international

కరోనా కాలంలో వ్యాయామం చేయాలా? వద్దా? - ఐరోపా దేశాలు

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే స్వీయ నిర్బంధంలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, నిత్యం వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల కరోనా మహమ్మారిని సులభంగా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా అందరూ సామాజిక దూరం పాటిస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా దగ్గరవ్వాలని చెబుతున్నారు.

Why home exercise is important during home isolation
స్వీయ నిర్బంధంలో ఉన్నా వ్యాయామం మానొద్దు
author img

By

Published : Mar 29, 2020, 7:45 PM IST

కరోనాకు చెక్​: నిర్లక్ష్యం వద్దు.. వ్యాయామం ముద్దు

కరోనా మహమ్మారి వల్ల అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలని సూచిస్తోంది బ్రిటీష్​ సైకాలజీ సొసైటీ. నిత్యం వ్యాయామం చేస్తూ, కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలని తెలిపింది. స్వీయ నిర్బంధంలో ఉన్నామని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం బ్రిటన్​ మొత్తం లాక్​డౌన్​లో ఉంది. ఈ సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని ప్రజలకు సూచిస్తోంది బ్రిటీష్​ సైకాలజీ సొసైటీ. ఒకే ఇంటికి చెందని ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట ఉండొద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ల కూడదని ఆదేశించింది. ఈ సమయంలో ఇంట్లో ఉన్నవారు తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలని పలు వ్యాయామ శిక్షకులు సూచిస్తున్నారు.

" సాధారణంగా తక్కువ సమయం వ్యాయామం చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తక్కువగానే ఉంటుంది. వారి స్థాయిని బట్టి వ్యాయామం చేయాలి. ఏవైనా గాయాలు అయినవారు, వృద్ధులు పది సార్లు సోఫాలో కూర్చొని లేవడం వంటివి చేస్తూ ఉండాలి. ఇలాంటి సులభమైనవి చేయాలి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచేందుకు అవకాశం ఉంటుంది. చేతులు, కాళ్లు పైకి కిందకి ఊపడం, జాగింగ్​, వాకింగ్​ వంటివి చేయాలి."

- షార్ప్​, వ్యక్తిగత వ్యాయామ శిక్షకుడు

వ్యాయామంతో వ్యాధులను అదుపు చేయొచ్చు

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులు తగ్గుముఖం పడతాయని అమెరికా పరిశోధకులు​ తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను దూరం చేయొచ్చని చెప్పారు. అంతేకాకుండా వ్యాయామం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని, ఆందోళన తగ్గుతుందని వెల్లడించారు పరిశోధకులు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో ప్రారంభమవుతున్న ఈ కరోనా మహమ్మారిని పలు అనారోగ్య సమస్యలున్న వృద్ధులు ఎదుర్కోలేక మరణిస్తున్నారు. అందుకే వ్యాయామం చేస్తూ, పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు వ్యాయామ నిపుణులు.

ఇదీ చదవండి: కరోనా కేసుల్లో చైనాను మించిన అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.