ETV Bharat / international

'ఆస్ట్రాజెనెకా సేఫ్.. అక్కడ తయారైతేనే ఇబ్బంది!'

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​పై ఐరోపా దేశాలు అనుమానాలు వ్యక్తం చేయడంపై డబ్ల్యూహెచ్​ఓ స్పందించింది. ఐరోపాలో ఉత్పత్తి అయిన టీకాలు మాత్రమే దుష్ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం చేసింది.

WHO
'ఆస్ట్రాజెనెకా సేఫ్.. దుష్ప్రభావాలకు ఆ కేంద్రాలే కారణం'
author img

By

Published : Mar 16, 2021, 1:06 PM IST

ఆస్ట్రాజెనెకా టీకాపై వ్యక్తమవుతున్న అనుమానాలు.. పంపిణీపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఐరోపాలోని పలు దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​పై తాత్కాలిక నిషేధం విధించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్​ఓ సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రాజెనెకా టీకా దుష్ప్రభావం చూపిస్తోందని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొందరికి రక్తం గడ్డకడుతోందని ఐరోపా దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆ సమస్య ఐరోపా ఉత్పత్తి కేంద్రాల లోపం కారణంగా ఏర్పడిందని డబ్ల్యూహెచ్​ఓ చెబుతోంది.

"మేము ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలము. కానీ ఐరోపా ఉత్పత్తి కేంద్రాల్లో తయారైన టీకాలు మాత్రమే దుష్ఫలితాలు ఇస్తున్నాయి. కొవాక్స్ కార్యక్రమం కింద మేము పంపిణీ చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి సమస్య తలెత్తలేదు. భారత్​, దక్షిణ కొరియాలో తయారు చేసిన ఈ టీకాలను మేము వివిధ దేశాలకు అందిస్తున్నాము. పలు దేశాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు టీకా పంపిణీపై ఎలాంటి ప్రభావం చూపలేదు."

-మేరీ ఏంజెలా సిమో, ప్రపంచ ఆరోగ్య సంస్థ అదనపు డైరెక్టర్

ఆస్ట్రాజెనెకా దుష్ప్రభావం చూపిస్తోందంటూ గత వారం డెన్​మార్క్​.. టీకాపై తాత్కాలిక నిషేధం విధించింది. అదే బాటను జర్మనీ, ఫ్రాన్స్​, ఇటలీ, స్పెయిన్ దేశాలు అనుసరించాయి. ఐరోపా ఇతర దేశాల్లో థాయ్​లాండ్, కాంగో దేశాలు ఆ జాబితాలో చేరాయి.

థాయ్​​ ప్రధానికి టీకా..

థాయ్​లాండ్​ ప్రధాని ప్రయుత్​ ఛాన్​ ఓచా మంగళవారం ఆస్ట్రాజెనెకా టీకా తొలి డోసు తీసుకున్నారు. ప్రధాని ప్రయుత్​ సహా పలువురు కేబినెట్​ సభ్యులు కూడా వ్యాక్సిన్​ అందుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రాజెనెకా టీకాపై తాత్కాలిక నిషేధం విధించిన థాయ్​లాండ్​.. ఇటీవల నిషేధాన్ని తొలగించింది. 'మనం వైద్యులను, వైద్యరంగ నిపుణులను విశ్వసించాలి' అని ప్రధాని ప్రయుత్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి : మయన్మార్ హింసాకాండపై గుటెరస్ గరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.