ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో అమెరికా తిరిగి జతకట్టడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
"డబ్ల్యూహెచ్ఓకు, ప్రపంచ ఆరోగ్యానికి ఇది మంచిరోజు. ప్రపంచంలో అమెరికా పాత్ర కీలకం. నిబద్ధతతో డబ్ల్యూహెచ్ఓలో తిరిగి చేరినందుకు అధ్యక్షుడు బైడెన్‌కు ధన్యవాదాలు. దీంతో కొవిడ్ టీకా పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటుంది."
-టెడ్రోస్ అథనోమ్ , డబ్ల్యూహెచ్ఓ చీఫ్.
డబ్ల్యూహెచ్ఓకు అన్ని విధాలుగా అమెరికా మద్దతు లభిస్తుందని ఉన్నతస్థాయి వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ వెల్లడించిన కొద్ది నిమిషాల్లోనే బైడెన్‌కు.. అథనోమ్ కృతజ్ఞతలు తెలిపారు.