ETV Bharat / international

కరోనా లెక్కలపై సౌమ్య స్వామినాథన్​ ఆందోళన - డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వామినాథన్​

దేశంలో కొనసాగుతున్న రెండోదశ కొవిడ్​-19 ఉద్ధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్​ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్​పై ఇనిస్టిట్యూట్​ ఆఫ్ హెల్త్​ మెట్రిక్స్​ అండ్​ ఎవాల్యుయేషన్​(ఐహెచ్​ఎంఈ) వెల్లడించిన గణాంకాలు వాస్తవం కావచ్చు, కాకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

Soumya Swaminathan, WHO Chief Scientist
సౌమ్య స్వామినాథన్​
author img

By

Published : May 11, 2021, 2:38 PM IST

భారత్​లో రెండో దశ కరోనా విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్​ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులకు సంబంధించి వాస్తవ గణాంకాల వెల్లడిలో ప్రభుత్వాలు మరింత కృషిచేయాలన్నారు. ప్రస్తుత డేటా ఆధారంగా ఆగస్టు నాటికి కరోనా కారణంగా.. సుమారు 10లక్షల మంది చనిపోయే అవకాశముందని ఇని​స్టిట్యూట్​ ఫర్​ హెల్త్​ మెట్రిక్స్​ అండ్​ ఎవాల్యుయేషన్​(ఐహెచ్​ఎంఈ) వెల్లడించిందని ఆమె అన్నారు. అయితే.. ఈ అంచనాలు వాస్తవం కావచ్చు, కాకపోవచ్చని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ సైంటిస్ట్​ సౌమ్య స్వామినాథన్​ ఇంటర్వ్యూ

"భారత్​, ఇతర ఆగ్నేయ దేశాలలో రోజువారీగా నమోదవుతున్న కేసులు, మరణాలను చూస్తే తీవ్ర ఆందోళనగా ఉంది . ఈ సమయంలో అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇవి వాస్తవ గణాంకాలను తక్కువ చేసి చూపుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలూ వాస్తవ లెక్కల్ని వెల్లడించడం లేదు. కరోనా కేసుల విషయంలో నిజమైన లెక్కల్ని వెల్లడించేందుకు అన్ని ప్రభుత్వాలు కృషిచేయాలి."

- సౌమ్య స్వామినాథన్​, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త

ఇదీ చదవండి: 'వారిలో టీకా పనితీరు తక్కువే'

ఇదీ చదవండి: 'మా దేశంలో ఒక్క కొవిడ్ కేసు లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.