ETV Bharat / international

'ప్రపంచానికి మరో వైరస్ ముప్పు'.. ఉక్రెయిన్​కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

Ukraine Pathogens: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ దేశాలకు మరో కొత్త చిక్కును తీసుకురానుందా? ఇప్పటికే కరోనా వేరియంట్లతో అల్లాడుతున్న ప్రపంచానికి మరో కొత్త వైరస్‌ను పరిచయం చేయనుందా? ఉక్రెయిన్‌లోని పరిశోధనా ల్యాబ్‌లలో పాథోజెన్స్‌ను వెంటనే నాశనం చేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు ఈ ప్రశ్నలకు జీవం పోస్తున్నాయి. రష్యా జరుపుతున్న వైమానిక దాడుల్లో అక్కడి ల్యాబ్‌లు దెబ్బతింటే హానికారకమైన పాథోజెన్స్‌ పెను విషాధాన్ని మిగులుస్తాయన్న డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరికల్లో ఆంతర్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Ukraine Pathogens
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచానికి మరో ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!
author img

By

Published : Mar 11, 2022, 12:59 PM IST

WHO Pathogens Warning: గత శతాబ్దాల కాలంగా ప్రపంచ దేశాలపై ఎన్నో వైరస్‌లు బ్యాక్టీరియాలు, హానికారక క్రిములు దాడి చేస్తూనే ఉన్నాయి. అలాంటి ప్రాణాంతక మహమ్మారులపై పరిశోధనలు చేసి వాటిని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనశాలలు కృషి చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లపై ప్రయోగాలు చేసే ఈ ల్యాబ్‌లలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను విషాదాన్ని నింపక తప్పదు. సరిగ్గా కరోనా విషయంలోనూ ఇదే జరిగిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. వుహాన్‌ ల్యాబ్‌లో జరిగిన తప్పిదం వల్లే వైరస్‌ పుట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ల్యాబ్‌ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా చేస్తున్న ముప్పెట దాడితో ల్యాబ్‌లు దెబ్బతిని వ్యాధికారక ప్యాథోజెన్స్‌ గాలిలో కలిసే ప్రమాదముందని అభిప్రాయపడింది. ఈ ల్యాబ్‌లలోని హానికారక పాథోజెన్స్‌ను వెంటనే నాశనం చేయాలని ఉక్రెయిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించింది.

Russia Ukraine news

ఇత‌ర దేశాల త‌ర‌హాలోనే ఉక్రెయిన్‌లో ప‌బ్లిక్ హెల్త్ ల్యాబొరేట‌రీలు ఉన్నాయి. అక్కడ ప్రమాద‌క‌ర‌మైన వ్యాధుల గురించి అధ్యయ‌నం చేస్తున్నారు. మ‌నుషులు, జంతువుల‌కు సోకే రోగాల‌పై విస్తృతంగా పరిశోధనలు చేసి వాటిని నియంత్రించే ఔషధాలను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కొవిడ్‌-19 గురించి కూడా ఉక్రెయిన్ ల్యాబ్స్‌లో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నట్లు డ‌బ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. కొన్ని ల్యాబ్‌ల‌కు అమెరికా, ఈయూ, డ‌బ్ల్యూహెచ్‌ఓ నుంచి కూడా నిధులు అందుతున్నాయి. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేప‌థ్యంలో వ్యాధికార‌క క్రిముల‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న ల్యాబ్స్‌పై దృష్టి పెట్టాల్సి వ‌స్తోంది. అమెరికా ఆధీనంలో ఉన్న జీవ, ర‌సాయ‌నిక ఆయుధాల కేంద్రాలు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉక్రెయిన్‌ను హెచ్చరించింది.

Russia Ukraine war

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన పాథోజెన్స్‌ అంటే జీవశాస్త్రంలో రోగాలను కలిగించే క్రిమి అని అర్థం. ఈ పదం 1880వ దశకంలో వాడుకలోకి రాగా వీటిపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అని పిలుస్తారు. ప్యాథాలజీ పదాన్ని రోగకారకాలైన వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు లాంటి సూక్ష్మజీవులన్నింటికీ కలిపి వాడుతుంటారు. ఇవి రకరకాల మార్గాల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. గాలి ద్వారా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తాకడం వల్ల, లైంగిక సంబంధం వల్ల, రక్తమార్పిడి ద్వారా, తల్లి పాల నుంచి లేదా మరేదైనా శారీరక ద్రవాల ద్వారా ఇవి వ్యాపిస్తుంటాయి.

ఇదీ చదవండి: క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా దూకుడు- అమెరికా ఆందోళన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.