ETV Bharat / international

టీకా తీసుకున్నాక పుతిన్​ ఏమన్నారంటే.. - రష్యాలో వ్యాక్సినేషన్​

కొవిడ్​ టీకా తీసుకున్న తర్వాత రోజు ఎముకల్లో కాస్త నొప్పిగా అనిపించిందని అన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో పుతిన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

vladimir putin
టీకా తీసుకున్నాక పుతిన్​ ఏమన్నారంటే..
author img

By

Published : Mar 29, 2021, 5:41 AM IST

Updated : Mar 29, 2021, 6:59 AM IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న అనంతరం తనకు అసౌకర్యంగా అనిపించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. టీకా తీసుకున్నవారిలో స్వల్ప దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని ఇప్పటికే కొన్ని దేశాల్లో విమర్శలు వస్తున్నాయి. అయితే టీకా పొందిన తర్వాత తనకు కూడా స్వల్పంగా ఆరోగ్య సమస్య తలెత్తిందని పుతిన్‌ పేర్కొన్నారు.

"వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా మంగళవారం టీకా తీసుకున్నాను. తర్వాతి రోజు ఉదయం నా ఎముకల్లో కాస్త నొప్పిగా అనిపించింది. అయినా థర్మామీటర్‌లో శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలోనే చూపించింది."

-వ్లాదిమిర్‌ పుతిన్‌, రష్యా అధ్యక్షుడు

ప్రస్తుతం రష్యావ్యాప్తంగా స్పుత్నిక్ వీ టీకా అందుబాటులో ఉందని పుతిన్​ వివరించారు. కాగా, ఆ దేశంలో 4.3 మిలియన్ల మంది వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారని గతంలో ప్రకటించారు. వేసవి చివరి నాటికి అందరిలో రోగనిరోధక శక్తి పెరగాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.

టీకా పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్‌లోనే రష్యా ప్రారంభించింది. ఈ క్రమంలో దేశంలో ఇంకా రెండొంతుల మంది స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ తీసుకోలేదని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 4.5 మిలియన్‌ల మంది కరోనా బారినపడ్డట్లు అధికారులు వివరించారు.

ఇదీ చూడండి:'2036 వరకు అధ్యక్షుడిగా పుతిన్'​ బిల్లుకు ఆమోదం

Last Updated : Mar 29, 2021, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.