ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రష్యాలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 28,145 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రష్యాలో మొత్తంగా 24 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 41,607 మంది వైరస్ కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాల దృష్ట్యా రెండోసారి లాక్డౌన్ విధించేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. కానీ, కట్టుదిట్టమైన చర్యల విషయంలో రాష్ట్రాల వారీగా భిన్నమైన పరిమితులు ఉన్నాయి. కొవిడ్ వ్యాప్తిలో రష్యా నాలుగో స్థానంలో ఉంది.
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది కొవిడ్‌బారిన పడ్డారు. 1.5 కోట్ల మంది వైరస్‌కు బలయ్యారు. మరోవైపు అమెరికాలో ఒకేరోజు లక్ష మందికి పైగా కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరారు. 3,157 మంది వైరస్ కారణంగా మృతిచెందారు.
కొత్త సంవత్సరమైనా తప్పదు
కరోనా దృష్ట్యా.. డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు రెస్టారెంట్లు, కేఫ్‌లు, బార్లు పూర్తిగా మూసేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మ్యూజియం, థియేటర్లు, ఎగ్జిబిషన్ హాళ్లను తెరవకూడదని హెచ్చరించింది.
ప్రపంచ దేశాల్లో కొవిడ్ వ్యాప్తి ఇలా..
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 14,314,265 | 2,79,867 |
భారత్ | 9,538,757 | 1,38,712 |
బ్రెజిల్ | 6,436,650 | 1,74,531 |
రష్యా | 2,375,546 | 41,607 |
ఫ్రాన్స్ | 2,244,635 | 53,816 |
స్పెయిన్ | 1,682,533 | 45,784 |
బ్రిటన్ | 1,659,256 | 59,699 |
ఇటలీ | 1,641,610 | 57,045 |
అర్జెంటినా | 1,440,103 | 39,156 |
కొలంబియా | 1,334,089 | 37,117 |