ETV Bharat / international

ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌: డబ్ల్యూహెచ్​ఓ

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది డబ్ల్యూహెచ్​ఓ. ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించింది.

tedros adhanom
టెడ్రోస్‌ అధనామ్
author img

By

Published : Oct 7, 2020, 10:40 AM IST

కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలో టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

"యావత్​ ప్రపంచం వ్యాక్సిన్‌ కోసం వేచిచూస్తోంది. ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా దేశాధినేతల హామీ ఈ తరుణంలో అత్యవసరం."

- టెడ్రోస్​ అధనామ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​

వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీలో సహకారం కోసం ప్రపంచ దేశాలు 'కోవాక్స్‌' పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ కూటమి ఆధ్వర్యంలో తొమ్మిది వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఫైజర్‌ కంపెనీ తయారు చేస్తున్న టీకాపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ చూడండి: కరోనా విలయం.. 3.60 కోట్లు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.