ETV Bharat / international

'కేన్స్​' సినీ సంబరానికి అదిరే ఆరంభం - ద డెడ్​ డోంట్ డై

ప్రతిష్టాత్మక 72వ కేన్స్ చలన చిత్రోత్సవం ఫ్రాన్స్​లోని కేన్స్​లో అట్టహాసంగా మొదలైంది. ఆరంభ చిత్రంగా జిమ్ జర్మస్క్ తెరకెక్కించిన 'ద డెడ్ డోంట్ డై'ను ప్రదర్శించారు.

'కేన్స్​' సినీ సంబరానికి అదిరే ఆరంభం
author img

By

Published : May 15, 2019, 10:44 AM IST

ప్రపంచ ప్రఖ్యాత కేన్స్​ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 72వ ఏడాది జరుగుతున్న ఈ సినిమా సంబరానికి ఫ్రాన్స్​లోని కేన్స్​ నగరం వేదికైంది. జిమ్ జర్ముస్క్ దర్శకత్వం వహించిన 'ద డెడ్ డోంట్ డై' చిత్రాన్ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు. ఈ సినిమాలో నటించిన టిల్డా స్విన్​టన్, బిల్​ ముర్రే, ఆడమ్ డ్రైవర్, సెలెనా గొమేజ్​ ఫిల్మ్ ఫెస్టివల్​లో సందడి చేశారు.

తొలి రోజున జేవియర్ బార్డెమ్, జూలియాన్నే మూర్, ఈవా లాంగోరియా రెడ్​ కార్పెట్​పై నడుస్తూ హొయలొలికించారు.

ఈ ఏడు జ్యూరీకి మెక్సికోకు చెందిన దర్శకుడు అలెగ్జాండ్రో గొంజాలెజ్ ఇనారిటు నేతృత్వం వహిస్తున్నారు. జ్యూరీ సభ్యులుగా ఎల్లె ఫాన్నింగ్, యోర్గోస్ లాంతీమోస్ ఉన్నారు.

మొత్తం 12 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినీ ప్రదర్శన మే 25వరకు కొనసాగనుంది. మొత్తంగా 19 చిత్రాలు ఈ ఏడాది ప్రదర్శనకు ఎంపికయ్యాయి. 2010 నుంచి భారత చిత్రాలు కేన్స్​లో ప్రదర్శనకు ఎంపికవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం భారత చిత్రమేదీ ప్రదర్శనకు ఎంపిక కాలేదు.

'కేన్స్​' సినీ సంబరానికి అదిరే ఆరంభం

ఇదీ చూడండి: 'బిగ్​ బీ' కామెడీ పంచ్​లకు మీరు సిద్ధమా..?

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.