ETV Bharat / international

భారత్​లో కరోనా విజృంభణతో 'కొవాక్స్​'పై ప్రభావం!

సీరం టీకాల సరఫరాలో జాప్యం కారణంగా 'కొవాక్స్​' కార్యక్రమానికి అంతరాయం ఏర్పడనుందని గవీ హెచ్చరించింది. భారత్​లో వైరస్​ కేసుల విజృంభణతో సీరం ఇన్​స్టిట్యూట్​ టీకాలను అనుకున్న సమయానికి అందించలేకపోతోందని పేర్కొంది.

UN-backed vaccine delivery program warns of supply delays
'కొవాక్స్​'కు టీకాల సరఫరాలో జాప్యం
author img

By

Published : Mar 26, 2021, 11:58 AM IST

భారత్​లోని సీరమ్​ సంస్థ నుంచి 9 కోట్ల కరోనా టీకా డోసుల సరఫరాలో జాప్యం జరిగిందని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని 'గవీ-కొవాక్స్​' గురువారం ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీకా అందించే కార్యక్రమంపై తీవ్ర ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్​లో వైరస్​ కేసులు పెరగడమే అందుకు కారణంగా పేర్కొంది కొవాక్స్​. కేసుల పెరుగుదలతో దేశీయ డిమాండ్​ పెరగటం వల్ల ఎగుమతులపై ప్రభావం చూపినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో.. మార్చి నెలలో 4కోట్లు, ఏప్రిల్​లో 5కోట్ల డోసుల సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది.

గవీ-కొవాక్స్ అనేది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద పేద దేశాలకు టీకా పంపిణీ కోసం ఏర్పడిన సమాఖ్య. ఈ కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా గవీ.. ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్ల డోసులను పంపిణీ చేయాలని నిశ్చయించింది. డోసుల సరఫరా జాప్యం దానిపై ప్రభావం చూపనుంది.

భారత్​పై ప్రశంసలు..

ఆఫ్రికా దేశాలకు కొవిడ్​19 వ్యాక్సిన్ అందించడంపై భారత్​ను కొనియాడారు అమెరికా కాంగ్రెస్​ఉమెన్ కారెన్ బాస్. తద్వారా మానవత్వంలో విశ్వాసాన్ని భారత్​ పెంపొందించిందన్నారు. ఇప్పటివరకు 70కి పైగా దేశాలకు 6కోట్ల పైచిలుకు టీకాలను భారత్​ సరఫరా చేసింది.

వాణిజ్య దెబ్బ..

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్​(ఏఎస్​ఎఫ్​) ప్రభావిత దేశాల జాబితాలో భారత్​ను చేర్చినట్లు అమెరికా గురువారం వెల్లడించింది. దీంతో భారత్​ నుంచి పంది మాంసం, ఉత్పత్తుల దిగుమతులను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గతేడాది మేలోనే తీసుకున్నట్లు తెలిపిన యూఎస్​.. ఏఎస్​ఎఫ్ తమ దేశంలోకి చొరబడకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది.

ఇదీ చూడండి: '100రోజుల్లో 20కోట్ల డోసుల టీకాయే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.